
పెంపుడు జంతువుల్లో కుక్కలకు ఉన్న క్రేజ్ వేరు. వాటి మీదే సినిమాలు వచ్చాయి. కథలు పుట్టాయి. కుక్కంటేనే పెట్స్‌లో అదొక బ్రాండ్! అయితే తాజాగా ‘ఏం! పిల్లులేం తక్కువ చేశాయి?’ అని చెప్పి పెట్స్‌లో పిల్లులకు కూడా క్రేజ్ తెస్తున్నారు పెట్ లవర్స్. ఇందుకోసం ‘ఇంటర్నేషనల్ క్యాట్ డే’ని కూడా స్టార్ట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు పిల్లులను పెంచుకుంటూ, వాటితో ఫొటోలు తీసుకుంటూ క్యాట్‌ను తమ పెట్స్‌గా గర్వంగా చూపించుకుంటున్నారు. ఆగస్టు 8 క్యాట్ డే సందర్భంగా అదితిరావు హైదరి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అలియా భట్ తదితర స్టార్ హీరోయిన్లు తమ పిల్లులతో ఫొటోలు దిగి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసి సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment