'ఊహించని విషాదమిది'
ముంబై: ఆర్లెండో నైట్ క్లబ్ నరమేధంపై బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్మాది తూటాలకు బలైన వారికి సంతాపం తెలిపారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం.. ఆర్లెండో నగరంలో గే (స్వలింగ సంపర్కులు)ల కోసం వెలిసిన పల్స్ నైట్ క్లబ్ లో ఆదివారం తెల్లవారుజామున ఉన్మాది జరిపిన కాల్పుల్లో 50 మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు.
'ఆర్లెండోలో కాల్పులు బాధాకరం. మృతులకు సంతాపం తెల్పుతున్నా. ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరూ వాడుకోరని భావిస్తున్నా'నని రిషికపూర్ పేర్కొన్నారు. ఆర్లెండో బాధితులకు వచ్చిన కష్టం ఊహించరాదని ఫర్హాన్ అక్తర్ అన్నాడు. నరమేధం గురించి తెలుసుకుని తన హృదయం ద్రవీంచిపోయిందని ప్రియాంక చోప్రా అంది. విద్వేష దాడులు ఆపాలని సోనమ్ కపూర్ ఆకాంక్షించింది. ఆర్లెండో కాల్పుల ఉదంతం తనను కలచివేసిందని, షాక్ కు గురి చేసిందని అలియా భట్ పేర్కొంది.
హింస ఆపాలని కోరుతూ సిద్ధార్థ మల్హోత్రా ఆర్లెండో కాల్పుల మృతులకు నివాళి అర్పించాడు. గన్ కల్చర్ పై అమెరికా సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కునాల్ కోహ్లి అన్నాడు. అర్జున్ రాంపాల్, బిపాసా బసు, అదితిరావు హైద్రి, పులకిత్ శర్మ, తమన్నా భాటియా కూడా సంతాపం ప్రకటించారు.
Please please stop the hate...
— Sonam Kapoor (@sonamakapoor) 13 June 2016
"It was times like these when I thought my father, who hated… https://t.co/cIAvHkeCYZ