సింగిల్ సీక్వెన్స్...30 డేస్ ట్రైనింగ్! | Baahubali 2 stunts top notch Prabhas trains for 30 days for one sequence | Sakshi
Sakshi News home page

సింగిల్ సీక్వెన్స్...30 డేస్ ట్రైనింగ్!

Published Wed, Sep 21 2016 11:18 PM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

సింగిల్ సీక్వెన్స్...30 డేస్ ట్రైనింగ్! - Sakshi

సింగిల్ సీక్వెన్స్...30 డేస్ ట్రైనింగ్!

ఇప్పుడు ‘బాహుబలి’ ఓ బ్రాండ్. యుద్ధ సన్నివేశాలు.. గ్రాఫిక్స్.. యాక్టింగ్.. పలు అంశాల్లో దర్శకుడు రాజమౌళి ఓ స్టాండర్డ్స్ సెట్ చేశారు. ప్రస్తుతం ‘బాహుబలి: ది కంక్లూజన్’ తెరకెక్కుతోంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. మొదటి భాగంతో సెట్ చేసిన స్టాండర్డ్స్‌ను అధిగమించడానికి యూనిట్ అందరూ తీవ్రంగా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడుతున్నారంటే.. సింగిల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రభాస్ 30 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న వార్ మూవీ కావడంతో ఆర్టిస్టులందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు. సెకండ్ పార్ట్‌లో ప్రతి యాక్షన్ సీన్ ‘బాహుబలి’లో యాక్షన్ సీన్లను తలదన్నేలా ఉంటుందట.
 
  ప్రభాస్ సహా మిగతా ఆర్టిస్టులందరూ అందుకు తగ్గట్టుగానే కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఓ యాక్షన్  సీక్వెన్స్‌కి అయితే ప్రభాస్ 30 రోజులు ట్రైనింగ్ తీసుకోవడం అతని కమిట్‌మెంట్‌కు నిదర్శనం అంటున్నారు యూనిట్ సభ్యులు. ఇది క్లైమాక్స్‌లో వస్తుందట. అక్టోబర్ కల్లా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement