లవ్‌ ఇన్‌ యూరప్‌ | Prabhas New Trilingual Movie With Radha Krishna Launched | Sakshi
Sakshi News home page

లవ్‌ ఇన్‌ యూరప్‌

Published Fri, Sep 7 2018 1:03 AM | Last Updated on Thu, Aug 22 2019 9:35 AM

Prabhas New Trilingual Movie With Radha Krishna Launched - Sakshi

ప్రభాస్‌

‘సాహో’ సినిమా సెట్స్‌ మీద ఉండగానే మరో సినిమాకు ముహూర్తం పెట్టేశారు హీరో ప్రభాస్‌. పూర్తి లవ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ సినిమాకు గురువారం కొబ్బరికాయ కొట్టారు. ప్రభాస్‌ హీరోగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ త్రిభాషా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

‘బిల్లా’ తర్వాత ప్రభాస్‌ హీరోగా ఆయన పెదనాన్న కృష్ణంరాజు నిర్మిస్తున్న చిత్రం ఇది కావడం విశేషం. ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరీలో పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ శాతం యూరప్‌లో జరగనుంది. ‘‘నా నెక్ట్స్‌ సినిమా లాంచ్‌ ఇవాళ జరిగింది. ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఎగై్జటెడ్‌గా ఉన్నాను. గోపీకృష్ణ మూవీస్, యూవీ నిర్మించే ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది’’ అని ప్రభాస్‌ పేర్కొన్నారు. ఈ చిత్రం 2020లో రిలీజ్‌ కానుంది. ఈనెల 20న షూటింగ్‌ స్టార్ట్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్‌ త్రివేది, కెమెరా: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement