
బెంట్లీ కార్... డాటర్స్ గిఫ్ట్!
బాలకృష్ణకు స్వీట్ సర్‌ప్రైజ్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘పైసా వసూల్’ చిత్రీకరణ నిమిత్తం గత నెల 13 నుంచి ఆయన పోర్చుగల్‌లో ఉండడంతో ఈ ఏడాది బర్త్‌డేను అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ సెలబ్రేషన్స్‌కి ఇండియా నుంచి బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, అల్లుళ్లు నారా లోకేష్, శ్రీభరత్ పోర్చుగల్ వెళ్లారు. ఆయనకు సర్‌ప్రైజ్ ఏంటంటే... కుమార్తెలు ఇద్దరూ ఖరీదైన బెంట్లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ సెలబ్రేషన్స్‌లో ‘పైసా వసూల్’ చిత్రనిర్మాత ‘భవ్య’ ఆనంద్‌ప్రసాద్, దర్శకుడు పూరి, చిత్రబృందం పాల్గొన్నారు.