
పంజగుట్ట: భీష్మ సినిమా పేరును, సినిమాలో హీరో పేరును మార్చాలని, లేనిపక్షంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమాను అడ్డుకుంటామని తెలంగాణ బెస్తగూండ్ల చైతన్య సమితి హెచ్చరించింది. మహాభారతానికి మూలం భీష్మ పితామహుడు, ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నారని, సినిమాలో వెకిలిచేష్టలు, అసభ్యకరమైన సీన్లు ఉన్నాయని వెంటనే సినిమా పేరు, హీరో క్యారెక్టర్ పేరు మార్చకపోతే జరిగే పరిణామాలకు వారే బాధ్యులవుతారని హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి అధ్యక్షులు పి.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎమ్.శకర్, శివసేన ప్రతినిధి సుదర్శన్, బీజేపీ ప్రతినిధి మైలారం రాజులు మాట్లాడుతూ సినిమా టైటిల్ విషయమై తాము ఇప్పటికే ఫిలించాంబర్‌లో ఫిర్యాదు చేశామని, సినిమా నిర్మాత వద్దకు వెళ్లగా ఆయన తమకు సినిమా చూపించారని, అందులో అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని, ఈవిషయాన్ని ఆయన దృష్టికి తేగా పట్టించుకోలేదన్నారు. ఇదే విషయమై డీజీపీని కలిసి వినతిపత్రం ఇస్తామని తెలిపారు. సమావేశంలో చెంద్రశేఖర్ బెస్త, సురేష్, గణేష్, తారకప్రభు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సమితి అధ్యక్షులు సత్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment