
'ఆ అలవాటును బ్రేక్ చేయండి..'
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. నటనతో పాటు ట్వీట్లతో అభిమానులకు చేరువగా ఉంటారు. అందుకే ఆయన ఫాలోవర్ల సంఖ్య 1.7 కోట్లకు చేరుకుంది. ఎప్పటిలానే.. 'ఆ అలవాటును బ్రేక్ చేయండి..' అంటూ మరో ట్వీట్తో అలరించారు బిగ్ బీ.
ఇంతకీ ఆయన దేని గురించి చెప్పారంటే.. 'ఎప్పుడూ సమస్యల గురించే మాట్లాడుకోవడం మనకి వ్యసనం అయిపోయింది. ఆ అలవాటును బ్రేక్ చేసేద్దాం. ఇక నుంచి మీ సంతోషాల గురించి మాట్లాడండి. ఎందుకంటే.. జీవితం అంటే ఈ రాత్రే.. ఈ క్షణమే..' అంటూ ట్వీట్ చేశారు అమితాబ్. మరి బిగ్ బీ చెప్పాక వినకుండా ఉంటామా! బ్రేక్ ద హేబిట్..