వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ | Bigg Boss 3 Telugu Ashu Reddy Eliminated In Fifth Week | Sakshi

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

Aug 25 2019 10:50 PM | Updated on Aug 26 2019 6:28 PM

Bigg Boss 3 Telugu Ashu Reddy Eliminated In Fifth Week - Sakshi

ఎలిమినేషన్‌ విషయంలో బిగ్‌బాస్‌ బృందం ఎంత ప్రయత్నించినా లీకులను ఆపలేకపోతోంది. సస్పెన్స్‌ మెయింటెన్‌ చేయడంలో నిర్వాహకులు విఫలమవుతూనే ఉన్నారు. మొదట్నుంచీ ఎలిమినేట్‌ అవ్వనున్న కంటెస్టెంట్‌ వివరాలు సోషల్‌ మీడియాలో ముందుగానే వచ్చేస్తున్నాయి. ఐదో వారంలో అషూ రెడ్డి ఎలిమినేట్‌ అయిందనే వార్త శనివారం సాయంత్రం నుంచే ట్రెండ్‌ అవుతూ వచ్చింది. తీరా చూస్తే అదే నిజమైంది. అషూ రెడ్డి ఎలిమినేట్‌ అయినట్లు ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున ప్రకటించాడు. శివజ్యోతితో మాస్క్‌లు పెట్టే ఆట ఆడించడం, నువ్వే.. నేను అంటూ క్యారెక్టర్స్‌ మార్చుకునే మరో ఆటను హౌస్‌మేట్స్‌తో ఆడించడం హైలెట్‌గా నిలిచింది. చివరగా బయటకు వచ్చిన అషూ.. హౌస్‌మేట్స్‌పై ఆసక్తికర కామెంట్లు చేసింది.

శివజ్యోతి చేత ఆట ఆడించిన నాగ్‌.. ఆమెతో మిగతా హౌస్‌మేట్స్‌కు సరిపోయే జంతువుల మాస్క్‌లను సెలక్ట్‌ చేయించాడు. దీంతో అలీరెజాకు సింహం.. బాబా భాస్కర్‌కు ఊసరవెళ్లి-నక్క, రాహుల్‌కు జింక, ఎక్కువగా తింటుందని హిమజకు ఏనుగు, శ్రీముఖికి కోతి, విశ్వాసంగా ఉంటాడని రవికి కుక్క, పగబడుతుందని అషూకు పాము, నెమ్మదస్తుడని.. ఎవ్వరినీ హర్ట్‌ చేయడని వరుణ్‌కు తాబేలు, పునర్నవికి కుందేలు, అందర్నీ నమ్ముతుందని వితికాకు గొర్రెపిల్ల మాస్క్‌లను తొడిగింది. అనంతరం హౌస్‌మేట్స్‌తో మరో గేమ్‌ను ఆడించాడు నాగ్‌. నువ్వే.. నేను అంటూ క్యారెక్టర్‌ను ఎక్స్‌చేంజ్‌ చేసుకునే గేమ్‌ ఆడించాడు. ఈ ఆటలో బాబా భాస్కర్‌ అషూలా, అషూ బాబా భాస్కర్‌లా నటించి చూపించారు. హిమజ.. రవిలా, రవి.. హిమజలా నటించారు. హౌస్‌లో హిమజ పాడే పాటను రవి పాడుతూ ఫన్‌ క్రియేట్‌ చేశాడు. రాహుల్‌.. శ్రీముఖిలా అంతగా నటించలేకపోయినా.. శ్రీముఖి మాత్రం రాహుల్‌లా నటించేసింది. అందరి దగ్గర పండ్లు ఎలా అడుక్కుంటాడో నటించి చూపించింది.

పునర్నవి వరుణ్‌లా.. వరుణ్‌ పునర్నవిలా నటించి హౌస్‌లో నవ్వులు పూయించారు. మహేష్‌.. శివజ్యోతిలా, శివజ్యోతి.. మహేష్‌లా నటించి గొడవల్లో ఇద్దరూ ఎలా ప్రవర్తిస్తారో చూపించారు. వితికా.. అలీలా నటించడానికి కాస్త కష్టపడ్డా.. అలీరెజా మాత్రం వితికాల చక్కగా నటించాడు. వరుణ్‌తో ఎలా అలుగుతుందో చూపించి ఫన్‌ క్రియేట్‌ చేశాడు. టాస్క్‌లు ముగిసిన అనంతరం అషూ రెడ్డి ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు నాగ్‌. బయటకు వచ్చిన అషూతో నాగ్‌ మరో గేమ్‌ ఆడించాడు. హౌస్‌లో ఉండేందుకు ఎవరికి అర్హత ఉంది? ఎవరికి అర్హత లేదు? అని చెప్పాలి.. అర్హత లేదు అనుకునే వారి ఫోటోలను పగలగొట్టాలని తెలిపాడు. దీంతో మహేష్‌, రాహుల్‌, వితికా, హిమజలకు హౌస్‌లో ఉండే అర్హత లేదంటూ వారి ఫోటోలను పగలగొట్టింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement