వీకెండ్‌లో నాగార్జున వచ్చి హౌస్‌మేట్స్‌తో పాటు బిగ్‌బాస్ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేశాడు. శ్రీముఖి ఈగను చంపేయడం.. ఆ విషయాన్ని బాబా భాస్కర్ హైలెట్ చేయడం.. వితికా-పునర్నవిలు అలగడం.. అనంతరం పునర్నవిని వితికా ఎత్తుకెళ్లడం.. హౌస్‌మేట్స్‌లో టాప్ లిస్ట్‌లో ఉండే కంటెస్టెంట్ల పేర్లు చెబుతూ బాబా భాస్కర్ ఫన్ క్రియేట్ చేయడం.. హౌస్‌మేట్స్‌తో మిత్రుడు, శత్రువు, వెన్నుపోటుదారులు టాస్క్ ఆడించడం హైలెట్‌గా నిలిచాయి.
(బిగ్‌బాస్.. ఎలిమినేట్ అయింది ఆమేనా?)
శ్రీముఖి ఈగను చంపేసిందని.. హౌస్‌మేట్స్‌తో చెప్పుకొచ్చాడు బాబా భాస్కర్. ఈగకు సంతాప సభ ఏర్పాటు చేసి హౌస్‌మేట్స్ బాధపడుతూ ఉంటే.. శ్రీముఖి ఆ ఈగను తీసి చెత్తబుట్టలో వేయడంతో తెగ బాధపడ్డారు. శ్రీముఖి ఈగను చంపిందంటూ.. బాబా భాస్కర్ హౌస్‌లో ఫన్ క్రియేట్‌చేశాడు. అనంతరం టాప్ లిస్ట్‌లో ఉండే హౌస్‌మేట్స్ పేర్లు చెబుతూ బాబా మాష్టర్ అందర్నీ నవ్వించాడు. పునర్నవికి వీడియోను ప్లే చేసి చూపించడం.. దీంతో వితికాపై అలగడం అందరికీ తెలిసిందే. ఆ ఘటనతో వీరిద్దరి మధ్య దూరం పెరగడం చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో వితికాను వరుణ్ బుజ్జగించడం, చివరకి బాబా భాస్కర్ సలహా మేరకు పునర్నవికి సారీ చెప్పేందుకు సిద్దమైంది. తీరా సారీ చెప్పడానికి వచ్చిన వితికా.. గొడవ పెద్దది చేసుకుని వెళ్లింది. మళ్లీ కాసేపటికి వచ్చి పునర్నవిని బుజ్జగించి.. ఎత్తుకుని తీసుకెళ్లింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు తగ్గినట్టు కనిపించింది.
అలీని అహంకారం తగ్గించుకోవాలని సూచించాడు. తనను హౌస్‌లో అందరూ గౌరవిస్తారని, సీరియస్ ఇష్యూని కామెడీ చేయోద్దని, ఏదైనా గొడవలు జరిగితే తగ్గించేందుకు ప్రయత్నించాలని బాబాకు సలహా ఇచ్చాడు. మహేష్‌కు ఉన్న కోపాన్ని తగ్గించుకోవాలని తెలిపాడు. మిత్రుడు, శత్రువు, వెన్నుపోటుదారులు అంటూ ఆట ఆడించిన నాగ్.. హౌస్‌మేట్స్ మనసులోని భావాలను బయటకు వచ్చేలా చేశాడు. రాహుల్‌ను మిత్రుడిగా, వరుణ్ సందేశ్‌ను శత్రువుగా, వితికాను వెన్నుపోటుదారునిగా పునర్నవి చెప్పుకొచ్చింది. తన గురించి వెనకాల మాట్లాడటం నచ్చలేదని అందుకే వితికా వెన్నుపోటు పొడిచిందని భావిస్తున్నట్లు తెలిపింది. వారిద్దరు కంటెస్టెంట్లుగా ఉండటం లేదు.. ఇద్దరూ కలిసి ఒకే గేమ్ ఆడుతున్నట్లు తనకు అనిపిస్తుందని తెలిపింది. అనంతరం హిమజ.. శ్రీముఖిని ఫ్రెండ్‌గా, వితికాను శత్రువుగా, అషూను వెన్నుపోటుదారులుగా పేర్కొంది. చిన్న కారణంతోనే తనను నామినేట్ చేసిందని అందుకే అషూను వెన్నుపోటుదారుల కేటగిరీలో పేర్కొన్నట్లు తెలిపింది.
ఆ తరువాత మహేష్ వచ్చి బాబా మాష్టర్‌ను మిత్రుడిగా, అలీని శత్రువుగా, శ్రీముఖిని వెన్నుపోటుదారుల లిస్ట్‌లో పేర్కొన్నాడు. బాబా మాష్టర్‌తో తాను మాట్లాడిన విషయాన్ని తనకు చెప్పలేదని శ్రీముఖిని వెన్నుపోటుదారునిగా పేర్కొన్నట్లు తెలిపాడు. పునర్నవిని మిత్రుడిగా, హిమజను శత్రువుగా, రవిని వెన్నుపోటుదారునిగా వితికా పేర్కొంది. కెప్టెన్సీ టాస్క్‌లో తనకు మద్దతు తెలపలేదని అందుకే అతడిని వెన్నుపోటు దారుల లిస్ట్‌లో చేర్చినట్లు తెలిపింది. పునర్నవిని మిత్రుడు, హిమజను శత్రువు, రవిని వెన్నుపోటుదారులుగా రాహుల్ పేర్కొన్నాడు. శివజ్యోతిని మిత్రుడుగా, బాబాను శత్రువుగా, హిమజను వెన్నుపోటుదారులుగా అషూ పేర్కొంది. తన గురించి వెనకాల మాట్లాడినందుకు హిమజను వెన్నుపోటుదారునిగా భావించినట్లు తెలిపింది.
అనంతరం శ్రీముఖి వచ్చి.. రాహుల్‌ను మిత్రుడుగా, బాబాను శత్రువుగా, వితికాను వెన్నుపోటుదారులుగా పేర్కొంది. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్ సమయంలో తన గురించి మాట్లాడుకున్నారని అందుకే తనను వెన్నుపోటుదారులుగా పేర్నొన్నట్లు తెలిపింది. మహేష్‌ను మిత్రుడుగా, వితికాను శత్రువుగా, పునర్నవిని వెన్నుపోటు దారులుగా వరుణ్ పేర్నొన్నాడు. ముప్పై సెకన్ల వీడియో చూపించారని, ముప్పై రోజుల ఫ్రెండ్‌షిప్‌ను అనుమానించడం కరెక్ట్ కాదు అందుకే.. తనను వెన్నుపోటుదారుల లిస్ట్‌లో చేర్చినట్లు వరుణ్ తెలిపాడు. అషూను మిత్రుడు, మహేష్‌ను శత్రువు, బాబాను వెన్నుపోటుదారుల లిస్ట్‌లో శివజ్యోతి పేర్కొంది. కెప్టెన్సీ టాస్క్‌లో తనకు సపోర్ట్ ఇవ్వలేదని అందుకే బాబాను ఆ క్యాటగిరీలో చేర్చానని తెలిపింది. శ్రీముఖిని మిత్రుడు.. అలీ, మహేష్‌లను బాబా మాష్టర్ వెన్నుపోటు క్యాటగిరీలో పేర్కొన్నాడు. శివజ్యోతిని మిత్రుడు, అలీని శత్రువు, వితికాను వెన్నుపోటుదారులు క్యాటగిరీలో రవికృష్ణ పేర్కొన్నాడు. శివజ్యోతిని మిత్రుడు, రవిని శత్రువు, హిమజను వెన్నుపోటు క్యాటగిరీలో అలీరెజా పేర్కొన్నాడు.
హౌస్‌మేట్స్‌కు కొన్ని సూచనలిచ్చిన నాగార్జున.. మహేష్, శివజ్యోతిలను సేవ్ అయినట్లు ప్రకటించాడు. మిగిలిన వారిలోంచి అషూ రెడ్డి ఎలిమినేట్ అయిందని ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలాగే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ వివరాలు లీక్ అవుతూ వస్తున్న తరుణంలో.. ఐదో వారం ఇంటి నుంచి వెళ్లే కంటెస్టెంట్ అషూ రెడ్డి అంటూ శనివారం సాయంత్రం నుంచే ట్రెండ్ అవుతూ వచ్చింది. మరి నిజంగానే అషూ ఇంటి నుంచి బయటకు వెళ్లిందా? లేదా అన్నది అధికారికంగా తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment