దేశానికి మంచి రోజులొచ్చాయి: సోనాక్షి | BJP in power is sign of good days to come, says Sonakshi | Sakshi
Sakshi News home page

దేశానికి మంచి రోజులొచ్చాయి: సోనాక్షి

Published Sun, Jun 1 2014 5:41 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

దేశానికి మంచి రోజులొచ్చాయి: సోనాక్షి - Sakshi

దేశానికి మంచి రోజులొచ్చాయి: సోనాక్షి

ముంబై: కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం పట్ల బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రావడంతో దేశానికి మంచి రోజులు వచ్చాయని చెప్పారు. సోనాక్షి తండ్రి బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా లోక్సభకు ఎంపికయ్యారు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినందుకు తమకు సంతోషంగా ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో మార్పులు తీసుకువస్తుండటం శుభపరిణామమని సోనాక్షి చెప్పారు. మోడీ మంత్రి వర్గంలో ఏడుగురి మహిళలకు స్థానం కల్పించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. కాగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతపై చెలరేగిన వివాదంపై స్పందించేందుకు నిరాకరించారు. తమ ఇంట్లో సినిమాలు, రాజకీయాల గురించి అరుదుగా మాట్లాడుతామని సోనాక్షి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement