ముంబై : బాలీవుడ్ నటి, నాగిని ఫేమ్ మౌనీ రాయ్ కరోనా లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా దుబాయ్‌లోనే ఉంటున్నారు. ఇంటికి తిరిగివచ్చే అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ మ్యాగజైన్ ఫొటో షూట్ కోసం మార్చి నెలలో ఆమె యూఏఈకి వెళ్లారు. నాలుగు రోజుల వర్కింగ్ ట్రిప్ కాస్తా రెండు నెలల పెయినింగ్ ట్రిప్‌గా మారింది. ప్రస్తుతం ఓ పాత ఫ్రెండ్‌తో కలిసి ఉంటున్నారు మౌనీ. పశ్చిమ బెంగాల్‌లోని కుటుంబాన్ని తలుచుకుంటూ నిత్యం బాధపడుతున్నారు. మౌనీ రాయ్ మాట్లాడుతూ.. ‘‘ ఫొటో షూట్ అయిపోయిన తర్వాత ఓ రెండు వారాలు దుబాయ్‌లో గడుపుదామని అనుకున్నాను. దానికి తోడు ఏప్రిల్ 15 వరకు నా చేతుల్లో ఏ ప్రాజెక్టు పనికూడా లేదు. ( మౌనీరాయ్ ప్లాస్టిక్ సర్జరీలు ఫెయిలయ్యాయా?)
నేను కొద్దిగా నిర్లక్ష్య స్వభావురాలిని. కానీ, ప్రపంచం మొత్తం ఇలా మూతపడుతుందని అనుకోలేదు. నాలుగు జతల బట్టలతో ఉంటున్నాను. ప్రతి రోజూ మా కుటుంబం గురించి ఆరా తీస్తూ ఉన్నాను. నా సోదరుడు మా అమ్మదగ్గర ఉండి చూసుకుంటున్నాడు. మా బంధువులు కూడా మా ఇంటి పక్కనే ఉండటం మంచిదైంది. ఇండియాకు ఎప్పుడు తిరిగి వెళతానోనని ఎదురు చూస్తున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment