రానా సినిమాకు కరణ్ సపోర్ట్ | bollywood producer Karan Johar Gets Rana Ghazi Rights | Sakshi
Sakshi News home page

రానా సినిమాకు కరణ్ సపోర్ట్

Published Tue, Sep 20 2016 2:58 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రానా సినిమాకు కరణ్ సపోర్ట్ - Sakshi

రానా సినిమాకు కరణ్ సపోర్ట్

యంగ్ హీరో రానా విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్నాడు. విలన్గా, సోర్టింగ్ రోల్స్ చేస్తూనే సోలో హీరోగా కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా రానా హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమా ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం భారీగా తెరకెక్కుతున్న బాహుబలి 2 తో పాటు యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఘాజీ సినిమాలో నటిస్తున్నాడు రానా . ఈ రెండు సినిమాల చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది.

ఈ రెండు చిత్రాల బాలీవుడ్ హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ సొంతం చేసుకున్నారు. బాహుబలి తొలి భాగంతో భారీ లాభాలు సొంతం చేసుకున్న కరణ్, ఆ సినిమా సీక్వల్ను ఎక్కువ మొత్తం చెల్లించి మరి సొంతం చేసుకున్నారట. అదే సమయంలో 1971లో మునిగిపోయిన పాకి స్థాన్ సబ్ మెరైన్ ఘాజీ కథతో రానా హీరోగాతెరకెక్కుతున్న సినిమాను కూడా బాలీవుడ్లో ఆయనే రిలీజ్ చేస్తున్నారు. కరణ్ లాంటి బడా ప్రొడ్యూసర్ తమ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఘాజీపై బాలీవుడ్లో కూడా మంచి హైప్ క్రియేట్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement