అన్నీ బుల్లెట్‌లే! | Bullet Rani Movie Audio Released | Sakshi
Sakshi News home page

అన్నీ బుల్లెట్‌లే!

Published Fri, Jul 17 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

అన్నీ బుల్లెట్‌లే!

అన్నీ బుల్లెట్‌లే!

శక్తిమంతమైన పోలీస్ అధికారిగా నిషా కొఠారి నటిస్తున్న చిత్రం ‘బుల్లెట్ రాణి’. సాజిద్ ఖురేషి దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఎం.ఎస్. యూసుఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గున్వంత్ సేన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం పాటల విడుదల సందర్భంగా నిషా కొఠారి మాట్లాడుతూ - ‘‘ఇందులోని ప్రతి పాటా బుల్లెట్‌లా ఉంటుంది. మంచి డ్యాన్సులు చేయడానికి స్కోప్ ఉన్న పాటలివి. ఇప్పటివరకు నేను ఎన్నో పాటలకు నర్తించినా ఈ సినిమాకి చేసిన డ్యాన్సులు ప్రత్యేకంగా ఉంటాయి’’ అన్నారు. కథానాయిక ప్రాధాన్యంగా సాగే ఈ యాక్షన్ మూవీలో బుల్లెట్ రాణిగా నిషా అద్భుతంగా నటించారని, ఆమె కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచే చిత్రం అవుతుందని దర్శకుడు తెలిపారు. పాటలు వీనుల విందుగా మాత్రమే కాదు.. కనువిందుగా కూడా ఉంటాయని నిర్మాత చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement