bullet rani
-
బుల్లెట్ రాణి గురించి ఎస్పీ ఆరా
విజయనగరం టౌన్: గరివిడి మండలంలోని శేరీపేటలో బుల్లెట్ ఓర్ మైనింగ్ వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన బెంగళూరు కంపెనీ నిర్వహకురాలు, కార్యకలాపాలపై జిల్లా ఎస్పీ జి.పాలరాజు దృష్టి సారించారు. బుల్లెట్ఓర్ తవ్వకాలపై సాక్షి ప్రచురిస్తున్న వరుస కథనాలపై ఎస్పీ స్పందించారు. బుల్లెట్‌రాణి ఎవరు? ఆమె కార్యకలాపాలు ఏమిటి? ఆమె వెనుక ఎవరున్నారు అనే కోణంలో పరిశోధనలు జరిపి నివేదిక ఇవ్వాలని స్పెషల్‌బ్రాంచ్ పోలీస్ అధికారులను ఆదేశించినట్లు ఎస్పీ పాలరాజు సాక్షికి వెల్లడించారు. -
బుల్లెట్ ఓర్ తవ్వకాల వెనుక ఓ మహిళ
విజయనగరంలో ఓ అధునాతన భవనం... అందులో ఓ యువతి... ఆమెకు రక్షణగా ఇద్దరు బాడీగార్డులు... ఇంట్లో పనికోసం నియమించుకున్న కొందరు పరివారం. ఆమె సాధారణ యువతి అనుకునేరు. ఏడాదిగా రూ. కోట్లలో లావాదేవీలు సాగించేస్తున్న ఓ ముఠా నాయకురాలు. ఆమెను సామాన్యులు కలవడం అంత సులభం కాదు. వ్యాపార లావాదేవీలకోసం వచ్చేవారిని క్షుణ్ణంగా పరిశీలించి... వారివద్ద నున్న మొబైళ్లతో సహా... ఉన్న వస్తువులు తీసుకుని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఇదంతా విలువైన ఖనిజాన్ని గుర్తించి దానిని తరలించేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక యంత్రాంగం. విజయనగరం కేంద్రంగా రెండు మూడు జిల్లాల్లో సాగిస్తున్న కార్యకలాపాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. మరో నమ్మశక్యం కాని విషయమేంటంటే... ఆ ముఠా నాయకురాలి నివాసం ఎస్పీ బంగ్లాకు కూతవేటు దూరంలోనే ఉండటం. సాక్షి ప్రతినిధి, విజయనగరం/టాస్క్‌ఫోర్స్: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజక వర్గం గరివిడి మండలం శేరిపేటలో అక్రమ మైనింగ్ వెనుక చాలా పెద్ద వ్యవస్థే ఉంది. బుల్లెట్ ఓర్ కోసం బెంగళూరు కంపెనీ పేరుతో ఇక్కడి రైతులను మభ్యపెట్టి తవ్వకాలు జరిపిస్తున్న ముఠాకు ఓ మహిళ నేతృత్వం వహిస్తోంది. విజయనగరం పట్టణంలో మకాం వేసి చుట్టు పక్కల జిల్లాల్లో బుల్లెట్ ఓర్ కోసం పరిశోధనలు జరుపుతున్నారు. ఇప్పటికే ఏడు మైనింగ్ ప్రాంతాలను గుర్తించగా వాటిలో మూడు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. విశాఖపట్నంలోని పెందుర్తి – సబ్బవరం జాతీయ రహదారికి సమీపంలో ఒక మైనింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మిగతావి కూడా పూర్తి చేయడానికి ఉన్నతస్థాయిలో లాబీయింగ్ నడుపుతున్నారు. ‘సాక్షి’ టాస్క్‌ఫోర్స్ పరిశోధనలో ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఎస్పీ బంగ్లాకు కూతవేటు దూరంలోనే నివాసం విజయనగరం పట్టణంలోని తోటపాలెం ప్రాంతంలో జిల్లా ఎస్పీ బంగ్లాకు కూత వేటు దూరంలో శ్రీనివాస కాలేజ్ వెనుక ఓ భవంతి ఉంది. పాశ్చాత్య సంస్కృతిని వంటబట్టించుకున్న ఓ మహిళ అందులో ఒంటరిగా నివసిస్తోంది. కొందరు బాడీగార్డ్స్ ఇద్దరు పనిమనుషులు ఆమె పరివారం. ఎవరైనా ఆమెను కలవాలని వస్తే గేటు వద్దనే బాడీగార్డ్స్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. మొబైల్స్‌తో పాటు అన్ని పరికరాలు లాక్కొని లోనికి పంపిస్తారు. అది కూడా తెలిసిన వాళ్లకైతేనే ప్రవేశం. కొత్తవారెవరికీ లోనికి ప్రవేశం లేదు. ఇక బుల్లెట్ ఓర్ తవ్వకాల గురించి మాట్లాడేందుకు వచ్చే వారికి తన డాబు, దర్పం ప్రదర్శిస్తుంది. తనకు కర్ణాటక రాష్ట్ర మంత్రులతో పరిచయాలున్నట్లు, కొందరు పెద్దలు, ఉన్నతాధికారులతో సంబంధాలున్నట్లు మాట్లాడుతారు. అవన్నీ విని ఆమెకు చాలా పెద్ద నెట్వర్క్ ఉందని అక్కడివారు భావిస్తుంటారు. ఆమె చెప్పినట్లు వింటే డబ్బులు బాగా సంపాదించవచ్చని నమ్ముతుంటారు. రెండు జిల్లాల్లో ఏడు మైనింగ్ ప్రాంతాలు బుల్లెట్ ఓర్ గురించి ఏ మాత్రం బయటకు పొక్కనివ్వకుండా తెర వెనుక చాలా పెద్ద తతంగమే నడిచింది. ఏడాది క్రితం విజయనగరంలో దిగిన బెంగళూరు మహిళ విజయనగరం జిల్లాతో పాటు విశాఖ జిల్లాలోనూ తవ్వకాలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విశాఖలో పెందుర్తి, సబ్బవరం జాతీయ రహదారికి వంద అడుగుల దూరంలోనే ఒక మైనింగ్‌లో తవ్వకాలు జరిపి ఓర్‌ను తరలించారు. మరో మూడు ప్రాంతాలను గుర్తించారు. జిల్లాలోనూ మూడు ప్రాంతాల్లో మైనింగ్ జరపాలనుకున్నారు. గరివిడి మండలం శేరిపేట, గుర్ల మండలం గుజ్జింగివలస, గంట్యాడ మండలం లకిడాం ప్రాంతాల్లో గనులు గుర్తించారు. పలాయనం చిత్తగించిన పరివారం శేరీపేటలో తవ్వకాలు చివరి దశకు చేరుకుంటున్న సమయంలో ‘సాక్షి’ వారి ప్రయత్నాన్ని బట్టబయలు చేసింది. దీంతో బుల్లెట్ రాణి పలాయనం చిత్తగించింది. తన బాడీగార్డులతో పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇంటిలో లకిడాం ప్రాంతానికి చెందిన ఒక మహిళ, ఒక యువతి ఉన్నారు. ‘సాక్షి’ టాస్క్‌ఫోర్స్ బృందం వారిని కలిసి ఆరాతీయగా... తమకేమీ తెలియదని, ఒక మేడమ్ తమను ఇంటి పనులకు నెల రోజుల క్రితం నియమించుకుని రూ. 3వేల జీతం ఇస్తామన్నారని వివరించారు. ప్రస్తుతం తమ మేడమ్ క్యాంపునకు వెళ్లారని వెల్లడించారు. ఈ రెండు జిల్లాల్లో దాదాపు వంద మంది రైతులు, అనుచరులతో సంప్రదింపులు జరిపిన బుల్లెట్ రాణి స్థానికుల సాయంతోనే కార్యకలాపాలు సాగిస్తున్నారు. -
నా భార్య మృతికి నేను కారణం కాదు...
సాక్షి, హైదరాబాద్ : తన భార్య సనా ఇక్బాల్ మృతికి తానే కారణమని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని... రోడ్డు ప్రమాదంలో గత వారం మృతి చెందిన బుల్లెట్ రైడర్ భర్త అబ్దుల్ నదీమ్ అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని టోలిచౌకి ఐఏఎస్ కాలనీలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సనా, తాను పదేళ్లుగా ప్రేమించుకున్నామని, ఆమె కుటుంబ సభ్యులను ఎదరించి మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నామన్నారు. తమ మధ్య వివాదాలున్న మాట వాస్తవమేనని, వాటి పరిష్కారానికి పోలీసులు ఆరుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. మనస్పర్థల వల్లే సనా తనతో వేరుగా ఉంటుందన్నారు. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణకు సహకరిస్తామని అబ్దుల్ నదీమ్ వెల్లడించారు. -
బుల్లెట్ రాణి పోరాటం
-
బుల్లెట్ రాణి పోరాటం
అవినీతి, అక్రమాలను సాగించే సంఘ విద్రోహ శక్తులపై ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి పోరాటం సాగించిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బుల్లెట్ రాణి’. నిషా కొఠారీ ప్రధాన పాత్రలో సాజిద్ ఖురేషీ దర్శకత్వంలో ఎం.ఎస్. యూసఫ్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిషా మాట్లాడుతూ- ‘‘నీతీ, నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నా. సరికొత్త కథాకథనాలతో దర్శకుడు సాజిద్ ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. ఇప్పటివరకు నేను చేసిన చిత్రాలన్నింటి కన్నా ఈ ‘బుల్లెట్ రాణి’ నాకెంతో ప్రత్యేకం. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. సాజిద్ ఖురేషీ మాట్లాడుతూ - ‘‘టైటిల్ రోల్‌కు న్యాయం చేయడానికి నిషా రెండు నెలల పాటు కసరత్తులు చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం నిర్మించాం. ఇటీవల రషెస్ చూసుకుంటే చాలా సంతృప్తి అనిపించింది. నవంబర్ ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. -
అన్నీ బుల్లెట్లే!
శక్తిమంతమైన పోలీస్ అధికారిగా నిషా కొఠారి నటిస్తున్న చిత్రం ‘బుల్లెట్ రాణి’. సాజిద్ ఖురేషి దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఎం.ఎస్. యూసుఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గున్వంత్ సేన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం పాటల విడుదల సందర్భంగా నిషా కొఠారి మాట్లాడుతూ - ‘‘ఇందులోని ప్రతి పాటా బుల్లెట్లా ఉంటుంది. మంచి డ్యాన్సులు చేయడానికి స్కోప్ ఉన్న పాటలివి. ఇప్పటివరకు నేను ఎన్నో పాటలకు నర్తించినా ఈ సినిమాకి చేసిన డ్యాన్సులు ప్రత్యేకంగా ఉంటాయి’’ అన్నారు. కథానాయిక ప్రాధాన్యంగా సాగే ఈ యాక్షన్ మూవీలో బుల్లెట్ రాణిగా నిషా అద్భుతంగా నటించారని, ఆమె కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచే చిత్రం అవుతుందని దర్శకుడు తెలిపారు. పాటలు వీనుల విందుగా మాత్రమే కాదు.. కనువిందుగా కూడా ఉంటాయని నిర్మాత చెప్పారు. -
టర్నింగ్ పాయింట్!
సంఘ విద్రోహ శక్తులపై మహిళా పోలీస్ ఆఫీసర్ ఎలా పోరాడిందనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘బుల్లెట్ రాణి’. నిషా కొఠారీ కథానాయికగా ఫోకస్ ఆర్ట్ పిక్చర్ పతాకంపై ఎం.ఎస్. యూసుఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాజిద్ ఖురేషీ దర్శకుడు. ఈ సినిమా పాటలను త్వరలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నిషా కొఠారీకి ఈ చిత్రం టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గున్వంత్‌సేన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: గోవింద్ యాదవ్. -
లేడీ గబ్బర్‌సింగ్‌లా..
అన్యాయం అంటే ఆ అమ్మాయికి అస్సలు పడదు. దాన్ని అంతమొందించడానికి ఎంతవరకూ అయినా వెళుతుంది. ఇక, సంఘవిద్రోహ శక్తుల అంతు చూడటానికి లేడీ గబ్బర్‌సింగ్‌లా మారిపోతుంది. అందుకే, అందరూ ఆమెను క్రమశిక్షణ గల పోలీస్ అధికారి అని అభినందిస్తారు. ఈ శక్తిమంతమైన పాత్రలో నిషా కొఠారి నటించిన చిత్రం ‘బుల్లెట్ రాణి’. తెలుగు, కన్నడ భాషల్లో ఇక్బాల్ దర్శకత్వంలో ఎం.ఎస్. యూసఫ్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇది హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం. యాక్షన్, కామెడీ, గ్లామర్ మేళవించిన కథతో ఈ చిత్రం ఉంటుంది. నిషా అందచందాలు, డేర్ డెవిల్ స్టంట్స్ ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. -
లేడీ గబ్బర్‌సింగ్
పవన్‌కల్యాణ్ పోషించిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్‌సింగ్’ పాత్రను హీరోయిన్ ఓరియెంటెడ్‌గా మలిస్తే ఎలా ఉంటుంది? దర్శకుడు సురేష్ గోస్వామి అదే చేశారు. ‘బుల్లెట్ రాణి’ పేరుతో ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రంలో ప్రియాంక కొఠారి లేడీ గబ్బర్‌సింగ్‌గా కనిపించనున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఎమ్మెస్ యూసఫ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘యాక్షన్ నేపథ్యంలో ఉండే మాస్ మసాలా ఎంటర్టైనర్ ఇది. శృంగార తార ఇమేజ్ కలిగిన ప్రియాంక ఇందులో రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తారు. గ్లామర్, యాక్షన్ల కలగలుపుగా ఆమె పాత్ర ఉంటుంది’’ అని చెప్పారు. ఇప్పటికి 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని, చివరిషెడ్యూలు త్వరలోనే మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గుణవంత్, యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్. -
బుల్లెట్ రాణిగా వస్తున్న లేడీ గబ్బర్ సింగ్!
పవన్ కల్యాణ్ గబ్బర్‌సింగ్ స్ఫూర్తితో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి 'బుల్లెట్ రాణి' చిత్రం రాబోతోంది. ఇది గబ్బర్ సింగ్ సినిమాకు మక్కీకి మక్కీ కాపీ కాదని, అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ నిషా కొఠారీ పాత్రను మాత్రం గబ్బర్ సింగ్‌లో పవర్ఫుల్ పోలీసు అధికారి పాత్రలో పవన్ కల్యాణ్ నటించిన తీరు స్ఫూర్తితోనే రూపొందించినట్లు ఈ చిత్ర దర్శకుడు సురేష్ గోస్వామి తెలిపారు. ఇందులో నిషా కొఠారీ కూడా పవర్ఫుల్ పోలీసు అధికారిణి పాత్రంలో నటిస్తోంది. తన సినిమాను గబ్బర్ సింగ్ ఫిమేల్ వెర్షన్ అంటే ఏమీ బాధపడను గానీ, అది మాత్రం కాపీ కాదని ఆయన చెప్పారు. నిషా పాత్రను మాత్రం పవన్ స్ఫూర్తితోనే రూపొందించామన్నారు. మహిళను బలమైన పోలీసు అధికారిణిగా చూపించేందుకే ప్రయత్నించామని ఆయన చెప్పారు. నిషా కొఠారీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు ఈ సినిమాతో మంచి ఇమేజ్ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిషా చాలా ప్రతిభావంతురాలైన నటి అని, ఇప్పుడు బుల్లెట్ రాణి సినిమాలో ఆమె చాలా విభిన్నంగా కనిపిస్తుందన్న నమ్మకం తనకుందని సురేష్ గోస్వామి అన్నారు. -
'నిషాకొఠారి' బుల్లెట్ రాణి మూవీ స్టిల్స్