
లేడీ గబ్బర్‌సింగ్‌లా..
అన్యాయం అంటే ఆ అమ్మాయికి అస్సలు పడదు. దాన్ని అంతమొందించడానికి ఎంతవరకూ అయినా వెళుతుంది. ఇక, సంఘవిద్రోహ శక్తుల అంతు చూడటానికి లేడీ గబ్బర్‌సింగ్‌లా మారిపోతుంది. అందుకే, అందరూ ఆమెను క్రమశిక్షణ గల పోలీస్ అధికారి అని అభినందిస్తారు. ఈ శక్తిమంతమైన పాత్రలో నిషా కొఠారి నటించిన చిత్రం ‘బుల్లెట్ రాణి’. తెలుగు, కన్నడ భాషల్లో ఇక్బాల్ దర్శకత్వంలో ఎం.ఎస్. యూసఫ్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇది హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం. యాక్షన్, కామెడీ, గ్లామర్ మేళవించిన కథతో ఈ చిత్రం ఉంటుంది. నిషా అందచందాలు, డేర్ డెవిల్ స్టంట్స్ ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు.