Nisha Kothari
-
రావణ లంకలో...
హాట్ గర్ల్ నిషా కొఠారి గుర్తుండే ఉంటుంది. రామ్‌గోపాల్ వర్మ ‘ఆగ్’ సినిమాలో హాట్ హాట్‌గా నటించిన ఈ బ్యూటీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాలు చేశారు. ఇప్పుడు ఆమె కథానాయికగా సంపత్ రాజ్ దర్శకత్వంలో మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ నిర్మించిన చిత్రం ‘ఓ రావణ లంక’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంపత్ రాజ్ మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్ యాక్షన్ చిత్రమిది. పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. క్లైమాక్స్ ఫైట్ హైలైట్. నిషా కొఠారి నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు. ‘‘సంపత్ చెప్పిన కథ నచ్చింది. మంచి సంగీతం కుదిరింది. చిత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు దివాకర్. ఈ చిత్రానికి సంగీతం: శిఘు, కెమెరా: వల్లి. -
బుల్లెట్ రాణి పోరాటం
-
బుల్లెట్ రాణి పోరాటం
అవినీతి, అక్రమాలను సాగించే సంఘ విద్రోహ శక్తులపై ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి పోరాటం సాగించిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బుల్లెట్ రాణి’. నిషా కొఠారీ ప్రధాన పాత్రలో సాజిద్ ఖురేషీ దర్శకత్వంలో ఎం.ఎస్. యూసఫ్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిషా మాట్లాడుతూ- ‘‘నీతీ, నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నా. సరికొత్త కథాకథనాలతో దర్శకుడు సాజిద్ ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. ఇప్పటివరకు నేను చేసిన చిత్రాలన్నింటి కన్నా ఈ ‘బుల్లెట్ రాణి’ నాకెంతో ప్రత్యేకం. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. సాజిద్ ఖురేషీ మాట్లాడుతూ - ‘‘టైటిల్ రోల్‌కు న్యాయం చేయడానికి నిషా రెండు నెలల పాటు కసరత్తులు చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం నిర్మించాం. ఇటీవల రషెస్ చూసుకుంటే చాలా సంతృప్తి అనిపించింది. నవంబర్ ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. -
పోలీస్ పవర్!
అవినీతి అక్రమాలతో పెట్రేగిపోతూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న కొంత మందిని ఓ పోలీస్ అధికారి ఎలా ఎదుర్కొంది? పోలీస్ పవర్‌ని ఎలా చూపించింది? అనే కథాంశంతో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న చిత్రం ‘బుల్లెట్ రాణి’. నిషా కొఠారి ప్రధాన పాత్రలో ఎం.ఎస్. యూసుఫ్ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాజిత్ ఖురేషి దర్శకుడు. గుణవంత్ స్వరాలందించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘గ్లామర్, యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సాహిత్యం: చంద్రబోస్, కరుణాకర్ అడిగర్ల. -
అన్నీ బుల్లెట్లే!
శక్తిమంతమైన పోలీస్ అధికారిగా నిషా కొఠారి నటిస్తున్న చిత్రం ‘బుల్లెట్ రాణి’. సాజిద్ ఖురేషి దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఎం.ఎస్. యూసుఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గున్వంత్ సేన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం పాటల విడుదల సందర్భంగా నిషా కొఠారి మాట్లాడుతూ - ‘‘ఇందులోని ప్రతి పాటా బుల్లెట్లా ఉంటుంది. మంచి డ్యాన్సులు చేయడానికి స్కోప్ ఉన్న పాటలివి. ఇప్పటివరకు నేను ఎన్నో పాటలకు నర్తించినా ఈ సినిమాకి చేసిన డ్యాన్సులు ప్రత్యేకంగా ఉంటాయి’’ అన్నారు. కథానాయిక ప్రాధాన్యంగా సాగే ఈ యాక్షన్ మూవీలో బుల్లెట్ రాణిగా నిషా అద్భుతంగా నటించారని, ఆమె కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచే చిత్రం అవుతుందని దర్శకుడు తెలిపారు. పాటలు వీనుల విందుగా మాత్రమే కాదు.. కనువిందుగా కూడా ఉంటాయని నిర్మాత చెప్పారు. -
లేడీ పోలీస్
ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ అక్రమార్కుల ఆగడాలను ఎలా ఎదుర్కొందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘బుల్లెట్ రాణి’. నిషా కొఠారీ ప్రధాన పాత్రలో ఎం.ఎస్. యూసుఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాజిద్ ఖురేషీ దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో విడుదల అయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే పాటలను విడుదల చేయనున్నాం. నిషా కొఠారీ గ్లామర్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయి’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత యూసుఫ్, ఇంకా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
టర్నింగ్ పాయింట్!
సంఘ విద్రోహ శక్తులపై మహిళా పోలీస్ ఆఫీసర్ ఎలా పోరాడిందనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘బుల్లెట్ రాణి’. నిషా కొఠారీ కథానాయికగా ఫోకస్ ఆర్ట్ పిక్చర్ పతాకంపై ఎం.ఎస్. యూసుఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాజిద్ ఖురేషీ దర్శకుడు. ఈ సినిమా పాటలను త్వరలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నిషా కొఠారీకి ఈ చిత్రం టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గున్వంత్‌సేన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: గోవింద్ యాదవ్. -
నిషా కొఠారి ‘క్రిమినల్స్’
-
'బుల్లెట్ రాణి'గా నిషా కొఠారి
-
లేడీ గబ్బర్ సింగ్
సంఘ విద్రోహ శక్తులపై ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ విజృంభించి, వారి ఆట ఎలా కట్టించిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బుల్లెట్ రాణి’. నిషా కొఠారీ ప్రధాన పాత్రలో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంఎస్. యూసఫ్ నిర్మిస్తున్నారు. సాజిద్ ఖురేషి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. లేడీ గబ్బర్ సింగ్ గా నిషా కొఠారీ బాగా నటించారనీ, గ్లామర్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించామనీ దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్: వి. సురేశ్‌కుమార్, సంగీతం: గున్వంత్. -
థ్రిల్‌కి గురి చేసే కథ
నిషా కొఠారి, అఖిల్ కార్తీక్ ముఖ్య తారలుగా పి. శ్రీనివాసరావు, సీహెచ్‌వీ శర్మ నిర్మిస్తున్న చిత్రం ‘క్రిమినల్స్’. ‘మంత్ర’, ‘మంగళ’ చిత్రాల దర్శకుడు ఓషో తులసీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే కథ ఇది. ‘మంత్ర’ ఆనంద్ స్వరపరచిన పాటలు ప్రధాన ఆకర్షణ అవుతాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: కె.వి. సుబ్బారావు, కె. నాగశేఖర్. -
లేడీ గబ్బర్‌సింగ్‌లా..
అన్యాయం అంటే ఆ అమ్మాయికి అస్సలు పడదు. దాన్ని అంతమొందించడానికి ఎంతవరకూ అయినా వెళుతుంది. ఇక, సంఘవిద్రోహ శక్తుల అంతు చూడటానికి లేడీ గబ్బర్‌సింగ్‌లా మారిపోతుంది. అందుకే, అందరూ ఆమెను క్రమశిక్షణ గల పోలీస్ అధికారి అని అభినందిస్తారు. ఈ శక్తిమంతమైన పాత్రలో నిషా కొఠారి నటించిన చిత్రం ‘బుల్లెట్ రాణి’. తెలుగు, కన్నడ భాషల్లో ఇక్బాల్ దర్శకత్వంలో ఎం.ఎస్. యూసఫ్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇది హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం. యాక్షన్, కామెడీ, గ్లామర్ మేళవించిన కథతో ఈ చిత్రం ఉంటుంది. నిషా అందచందాలు, డేర్ డెవిల్ స్టంట్స్ ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. -
లేడీ గబ్బర్‌సింగ్
పవన్‌కల్యాణ్ పోషించిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్‌సింగ్’ పాత్రను హీరోయిన్ ఓరియెంటెడ్‌గా మలిస్తే ఎలా ఉంటుంది? దర్శకుడు సురేష్ గోస్వామి అదే చేశారు. ‘బుల్లెట్ రాణి’ పేరుతో ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రంలో ప్రియాంక కొఠారి లేడీ గబ్బర్‌సింగ్‌గా కనిపించనున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఎమ్మెస్ యూసఫ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘యాక్షన్ నేపథ్యంలో ఉండే మాస్ మసాలా ఎంటర్టైనర్ ఇది. శృంగార తార ఇమేజ్ కలిగిన ప్రియాంక ఇందులో రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తారు. గ్లామర్, యాక్షన్ల కలగలుపుగా ఆమె పాత్ర ఉంటుంది’’ అని చెప్పారు. ఇప్పటికి 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని, చివరిషెడ్యూలు త్వరలోనే మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గుణవంత్, యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్. -
బుల్లెట్ రాణిగా వస్తున్న లేడీ గబ్బర్ సింగ్!
పవన్ కల్యాణ్ గబ్బర్‌సింగ్ స్ఫూర్తితో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి 'బుల్లెట్ రాణి' చిత్రం రాబోతోంది. ఇది గబ్బర్ సింగ్ సినిమాకు మక్కీకి మక్కీ కాపీ కాదని, అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ నిషా కొఠారీ పాత్రను మాత్రం గబ్బర్ సింగ్‌లో పవర్ఫుల్ పోలీసు అధికారి పాత్రలో పవన్ కల్యాణ్ నటించిన తీరు స్ఫూర్తితోనే రూపొందించినట్లు ఈ చిత్ర దర్శకుడు సురేష్ గోస్వామి తెలిపారు. ఇందులో నిషా కొఠారీ కూడా పవర్ఫుల్ పోలీసు అధికారిణి పాత్రంలో నటిస్తోంది. తన సినిమాను గబ్బర్ సింగ్ ఫిమేల్ వెర్షన్ అంటే ఏమీ బాధపడను గానీ, అది మాత్రం కాపీ కాదని ఆయన చెప్పారు. నిషా పాత్రను మాత్రం పవన్ స్ఫూర్తితోనే రూపొందించామన్నారు. మహిళను బలమైన పోలీసు అధికారిణిగా చూపించేందుకే ప్రయత్నించామని ఆయన చెప్పారు. నిషా కొఠారీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు ఈ సినిమాతో మంచి ఇమేజ్ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిషా చాలా ప్రతిభావంతురాలైన నటి అని, ఇప్పుడు బుల్లెట్ రాణి సినిమాలో ఆమె చాలా విభిన్నంగా కనిపిస్తుందన్న నమ్మకం తనకుందని సురేష్ గోస్వామి అన్నారు. -
'నిషాకొఠారి' బుల్లెట్ రాణి మూవీ స్టిల్స్
-
నువ్వే నా బంగారం మూవీ స్టిల్స్
-
సీక్వెల్ గా రాబోతున్న యమలీల
-
నువ్వే నా బంగారం...
సాయికృష్ణ, షీనా, నిషా కొఠారి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘నువ్వే నా బంగారం’. రామ్‌వెంకీ దర్శకుడు. పెరిచెర్ల కృష్ణంరాజు నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డి.ఐ వర్క్ జరుగుతోంది. యాజమాన్య స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెల 29న విడుదల చేయనున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి యాజమాన్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని, విజువల్‌గా పాటలన్నీ చాలా ప్లెజెంట్‌గా ఉంటాయని, డిసెంబర్ ప్రథమార్థంలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఎలాంటి సినిమాను చూడాలని ప్రేక్షకులు ప్రస్తుతం కోరుకుంటున్నారో అలాంటి సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. సుమన్, తనికెళ్ల భరణి, ప్రవీణ్, శ్రావణ్, శ్రీరాజ్, అశోక్‌కుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, మాటలు: లంకపల్లి శ్రీనివాస్, పాటలు: అనంతశ్రీరామ్, కెమెరా: రామ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ. -
అమ్మాయి అపరకాళిగా మారితే...
నిషా కొఠారి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘క్రిమినల్స్’. మంత్ర, మంగళ ఫేం ఓషో తులసీరామ్ దర్శకత్వంలో... సీహెచ్‌వీ శర్మ నిర్మిస్తోన్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి విజయకుమార్ కొండ కెమెరా స్విచాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించగా, చార్మి క్లాప్ ఇచ్చారు. ‘‘సౌమ్యంగా ఉండే ఓ అమ్మాయి అపరకాళిగా మారితే ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు సమాధానంగా ఇందులో నిషా కొఠారి పాత్ర ఉంటుంది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, డిసెంబర్లో సినిమా పూర్తి చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. ఓ వైపు సాఫ్ట్‌గా అనిపిస్తూ, మరో వైపు విభిన్న గెటప్పుల్లో కనిపిస్తానని నిషా కొఠారి తెలిపారు. మంత్ర, మంగళ చిత్రాల్లా ఇది కూడా సంచలనం సృష్టిస్తుందని సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. శక్తిమేర మంచి పాటలు ఇవ్వడానికి ప్రయత్నిస్తానని మంత్ర ఆనంద్ చెప్పారు. రాంజగన్, విజయసాయి, సతీష్, పూర్ణిమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: టి.జస్వంత్, కూర్పు: వినయ్‌రామ్, కళ: నాగేంద్రబాబు, నిర్మాణం: మంత్ర ఎంటర్టైన్మెంట్స్. -
‘క్రిమినల్స్’తో నిషా
చార్మి కథానాయికగా మంత్ర, మంగళ వంటి వినూత్న తరహా చిత్రాలు అందించిన ఓషో తులసీరామ్ ప్రస్తుతం ‘క్రిమినల్స్’ పేరుతో ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మంత్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై సీహెచ్‌వీ శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిషా కొఠారి ప్రధాన పాత్ర చేస్తున్నారు. చిత్రవిశేషాలను తులసీరామ్ తెలియజేస్తూ -‘‘సైబర్ క్రైమ్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే సినిమా ఇది. హైదరాబాద్, తలకోన, బ్యాంకాక్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం’’ అన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న చిత్రం ఇదని, ఈ కథ విని ఎగ్జయిట్ అయ్యానని నిషా తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ‘మంత్ర’ ఆనంద్.