లేడీ గబ్బర్‌సింగ్ | Nisha Kothari starrer Bullet Rani is not spoof on Gabbar Singh | Sakshi
Sakshi News home page

లేడీ గబ్బర్‌సింగ్

Published Tue, Sep 2 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

లేడీ గబ్బర్‌సింగ్

లేడీ గబ్బర్‌సింగ్

 పవన్‌కల్యాణ్ పోషించిన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్‌సింగ్’ పాత్రను హీరోయిన్ ఓరియెంటెడ్‌గా మలిస్తే ఎలా ఉంటుంది? దర్శకుడు సురేష్ గోస్వామి అదే చేశారు. ‘బుల్లెట్ రాణి’ పేరుతో ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రంలో ప్రియాంక కొఠారి లేడీ గబ్బర్‌సింగ్‌గా కనిపించనున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఎమ్మెస్ యూసఫ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘యాక్షన్ నేపథ్యంలో ఉండే మాస్ మసాలా ఎంటర్‌టైనర్ ఇది. శృంగార తార ఇమేజ్ కలిగిన ప్రియాంక ఇందులో రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తారు.  గ్లామర్, యాక్షన్‌ల కలగలుపుగా ఆమె పాత్ర ఉంటుంది’’ అని చెప్పారు. ఇప్పటికి 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని, చివరిషెడ్యూలు త్వరలోనే మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గుణవంత్, యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement