బుల్లెట్ రాణి పోరాటం | Priyanka Kothari is Bullet Rani | Sakshi
Sakshi News home page

బుల్లెట్ రాణి పోరాటం

Published Tue, Oct 27 2015 10:51 PM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

బుల్లెట్ రాణి పోరాటం

బుల్లెట్ రాణి పోరాటం

అవినీతి, అక్రమాలను సాగించే సంఘ విద్రోహ శక్తులపై ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి పోరాటం సాగించిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బుల్లెట్ రాణి’. నిషా కొఠారీ ప్రధాన పాత్రలో సాజిద్ ఖురేషీ దర్శకత్వంలో ఎం.ఎస్. యూసఫ్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిషా మాట్లాడుతూ- ‘‘నీతీ, నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నా. సరికొత్త కథాకథనాలతో దర్శకుడు సాజిద్ ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. ఇప్పటివరకు నేను చేసిన చిత్రాలన్నింటి కన్నా ఈ ‘బుల్లెట్ రాణి’ నాకెంతో ప్రత్యేకం.

సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. సాజిద్ ఖురేషీ మాట్లాడుతూ - ‘‘టైటిల్ రోల్‌కు న్యాయం చేయడానికి నిషా రెండు నెలల పాటు కసరత్తులు చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం నిర్మించాం. ఇటీవల రషెస్ చూసుకుంటే చాలా సంతృప్తి అనిపించింది. నవంబర్ ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement