పోలీస్ పవర్! | Police Power | Sakshi
Sakshi News home page

పోలీస్ పవర్!

Published Mon, Aug 24 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

పోలీస్ పవర్!

పోలీస్ పవర్!

అవినీతి అక్రమాలతో పెట్రేగిపోతూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న కొంత మందిని ఓ పోలీస్ అధికారి ఎలా ఎదుర్కొంది? పోలీస్ పవర్‌ని ఎలా చూపించింది? అనే కథాంశంతో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న చిత్రం ‘బుల్లెట్ రాణి’. నిషా కొఠారి ప్రధాన పాత్రలో ఎం.ఎస్. యూసుఫ్ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాజిత్ ఖురేషి దర్శకుడు. గుణవంత్ స్వరాలందించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘గ్లామర్, యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన  ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సాహిత్యం: చంద్రబోస్, కరుణాకర్ అడిగర్ల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement