సాక్షి, హైదరాబాద్ : తన భార్య సనా ఇక్బాల్ మృతికి తానే కారణమని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని... రోడ్డు ప్రమాదంలో గత వారం మృతి చెందిన బుల్లెట్ రైడర్ భర్త అబ్దుల్ నదీమ్ అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని టోలిచౌకి ఐఏఎస్ కాలనీలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సనా, తాను పదేళ్లుగా ప్రేమించుకున్నామని, ఆమె కుటుంబ సభ్యులను ఎదరించి మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నామన్నారు. తమ మధ్య వివాదాలున్న మాట వాస్తవమేనని, వాటి పరిష్కారానికి పోలీసులు ఆరుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. మనస్పర్థల వల్లే సనా తనతో వేరుగా ఉంటుందన్నారు. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణకు సహకరిస్తామని అబ్దుల్ నదీమ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment