Sana Iqbal
-
నా భార్య మృతికి నేను కారణం కాదు...
-
నా భార్య మృతికి నేను కారణం కాదు...
సాక్షి, హైదరాబాద్ : తన భార్య సనా ఇక్బాల్ మృతికి తానే కారణమని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని... రోడ్డు ప్రమాదంలో గత వారం మృతి చెందిన బుల్లెట్ రైడర్ భర్త అబ్దుల్ నదీమ్ అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని టోలిచౌకి ఐఏఎస్ కాలనీలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సనా, తాను పదేళ్లుగా ప్రేమించుకున్నామని, ఆమె కుటుంబ సభ్యులను ఎదరించి మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నామన్నారు. తమ మధ్య వివాదాలున్న మాట వాస్తవమేనని, వాటి పరిష్కారానికి పోలీసులు ఆరుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. మనస్పర్థల వల్లే సనా తనతో వేరుగా ఉంటుందన్నారు. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణకు సహకరిస్తామని అబ్దుల్ నదీమ్ వెల్లడించారు. -
సనా ఇక్బాల్ జీవితం విషాదాంతం..
‘సనాతో మాట్లాడినతరువాత ఆ ఆలోచన విరమించుకున్నా. ఏమైనా సరే జీవించి సాధించాల్సిందే..’ అంటూ ఎంతోమంది ఆమె ఫేస్బుక్ పేజీకి పోస్టు చేసేవారు. మన దేశంమహిళలకు ఎంతోసురక్షితమైంది.నా పర్యటనలో ప్రతి చోటా సముచితమైన గౌరవం, మర్యాద లభించాయి. ఎంతో ఆదరణ పొందాను. ‘సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్’ అంటూ దేశానికి చాటిచెప్పిన సనా ఇక్బాల్ జీవితం విషాదాంతమైంది. ఆత్మహత్యాయత్నాల నుంచి వేలాది మందికి విముక్తి కల్పించిన ఆమె మంగళవారం అనుమానాస్పదంగా మృతిచెందడం అభిమానులను కలవరపరచింది. జీవించే హక్కు కోసం మరణించేవరకూ పోరాడిన స్ఫూర్తి ప్రదాత. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపిన ధీరవనిత ఆమె. మరణం అంచుల్లో ఉన్న ఎంతోమందికి జీవితపు లోగిళ్లలో వెలుగులు నింపింది. తాను స్వయంగా తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యా సదృశమైన పరిస్థితులను జయించి ఫీనిక్స్‌లా పైకెగిసింది. తనలాగే డిప్రెషన్‌తో బాధడేవాళ్లను కలిసి ఆ బాధల నుంచి విముక్తి కల్పించింది. సనా స్ఫూర్తితో ఎంతోమంది ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడ్డారు. జీవితాన్ని ఉత్సాహభరితం చేసుకున్నారు. కానీ సనా...మూడు పదుల వయసులోనే మంగళవారం నాటి దుర్ఘటనలో కన్నుమూశారు. సాక్షి, సిటీబ్యూరో : ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ పిలుపునిచ్చి దేశవ్యాప్తంగా బైక్‌రైడ్ చేసి స్పూర్తి నింపిన హైదరాబాదీ అమ్మాయి సనా ఇక్బాల్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆత్మహత్యో, హత్యో, రోడ్డు ప్రమాదమో తెలియదు. కానీ ఆత్మహత్యల విజేత మాత్రం ఇక లేరు. ఆమె అభిమానులకు, డిప్రెషన్లో ఉన్న ఎంతోమందికి విషాదాన్ని మిగిల్చారు. ఆమె ఒక సాహసి.. సనా జీవితం ఆద్యంతం సాహసోపేతం. నిట్టూర్పులకు, నిరుత్సాహానికి తావు లేకుండా, నిరాశా నిస్పృహలను దరిచేరనీయకుండా గడిపారామె. చిన్న వయసులోనే చుట్టిముట్టిన కుంగుబాటును అధిగమించారు. ‘ఇక ఇంతేలే..జీవితం’ అనుకున్న నిస్సహాయ పరిస్థితుల్లో నలిగిపోయి ఫినిక్స్‌లా పైకెగిశారు. నగరంలోని టోలిచౌకీకి చెందిన సనా ఇక్బాల్ భౌతికంగా లేకపోయినా ఆమె అందించిన స్ఫూర్తి మాత్రం దేశంలోని అన్ని నగరాల్లో సజీవంగానే ఉంటుంది. ఆమె బైక్‌పై ఒంటరిగా దేశమంతా పయనించారు. 2015 నవంబర్ 23వ తేదీ నుంచి 2016 జూన్ 13వ తేదీ వరకు ఆమె చేసిన సాహసోపేత బైక్ రైడింగ్ ఒక సంచలనం. దేశంలోని 111 నగరాలు, 29 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలలో సనా పర్యటించారు. ఆత్మహత్యలకు వ్యతిరేకంగా స్ఫూర్తిని రగిలించారు. ఆరున్నర నెలల పాటు, 38 వేల కిలోమీటర్ల దూరం సాగిన ఈ మహా యాత్రలో వేలాదిమంది ఆమె అభిమానులయ్యారు. ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడ్డారు. ‘సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్’ అనే ఒకే ఒక్క నినాదమై సాగించిన యాత్రలో ఆమె వేలాది మందిని స్వయంగా పలికరించారు. ‘నాకు డిప్రెసివ్‌గా ఉందంటూ’ రాత్రి, పగలు తేడా లేకుండా ఆమె మొబైల్ ఫోన్‌కు ఎవరు సందేశాలు పంపించినా వెంటనే అప్రమత్తమయ్యేవారు. స్వతహాగా సైకాలజిస్ట్ అయిన సనా వారితో గంటలతరబడి మాట్లాడి ఆత్మహత్యా పరిస్థితుల నుంచి క్రమంగా బయటకు తీసుకొచ్చేవారు. ఆమె మాటలు వారిలో ధైర్యాన్ని నింపేవి. ఎంతో ఊరట కలిగించేవి. ‘సనాతో మాట్లాడిన తరువాత ఆ ఆలోచన విరమించుకున్నా. ఏమైనా సరే జీవించి సాధించాల్సిందే..’ అంటూ ఎంతోమంది ఆమె ఫేస్బుక్ పేజీకి పోస్టు చేసేవారు. కృతజ్ఞతలు చెప్పేవారు. ఇప్పటికీ ఆ సందేశాలు కనిపిస్తాయి. సైకాలజీలో ఎంఏ చేసిన సనా పలు కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలిచ్చారు. ఇదీ సనా ప్రస్తానం ...... సనా బైక్‌రైడింగ్ సాహసయాత్ర నాటికి ఆమె కొడుకు ఐదు నెలల పసికందు. ఆ చిన్నారి బాబును ఇంట్లోనే వదిలి పెట్టి ఈ యాత్ర చేపట్టారు. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. ‘ఆత్మహత్య దేనికీ పరిష్కారం కాదు’ అనే సందేశంతో చేపట్టిన ఆ సాహసయాత్ర వెనుక ఎంతో విషాదంఉంది. సనా తల్లి షాహీన్ అడ్వొకేట్. తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. సనా 2014 డిసెంబర్లో అబ్దుల్ నదీం అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో సంతోషంగా సాగుతుందనుకున్న దాంపత్య జీవితంలో ఒక్కసారిగా భయాందోళనలు అలుముకున్నాయి. నదీం వేధింపులతో సనాకు జీవితంపైనే విరక్తి కలిగింది. అతని నుంచి బయటకు వచ్చింది. కానీ అప్పటికే ఆమె గర్భిణి. ‘ఇక ఈ జీవితం బతకడానికి పనికిరానిదంటూ’ ఆమె తరచుగా ఆవేదన వ్యక్తం చేసేది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఆమెను తీవ్రంగా వేధించాయి. సరిగ్గా ఆ సమయంలోనే సనా వాస్తవంలోకి వచ్చారు. డిప్రెషన్‌ను, విషాదాన్ని జయించి యాత్ర చేపట్టారు. తనలాంటి ఎంతోమందిని కాపాడాలనే సత్సంకల్పానికి అలా శ్రీకారం చుట్టారు. రైడ్‌లోనే మృత్యువును జయించారు... ఆ సాహసోపేతమైన బైక్‌రైడింగ్ ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో సాగిందంటే .... రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ముఖం పూర్తిగా దెబ్బతిన్నది. ఒకరకంగా సనా అప్పుడే మృత్యుముఖంలోంచి బయటపడ్డారు. కానీ తన సాహసయాత్రకు ఈ ప్రమాదం ఆటంకం కాలేదు. తన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు వచ్చిన తరువాత సనాఏమన్నారంటే...‘మన దేశం మహిళలకు ఎంతో సురక్షితమైంది. నా పర్యటనలో ప్రతి చోట సముచితమైన గౌరవం, మర్యాద లభించాయి. ఎంతో ఆదరణ పొందాను. ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతంలో యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి ముఖం బాగా పాడయింది. టూర్‌కి ముందు ఇలాంటి ప్రమాదం జరిగి ఉంటే తప్పకుండా డిప్రెషన్లోకి వెళ్లెదాన్ని. కానీ ఇప్పుడు ఆ యాక్సిడెంట్ వల్ల పాడైన ముఖం నన్ను బాధ పెట్టలేదు. నాలాంటి ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చిన ఈ రైడ్‌ను చివరి వరకు కొనసాగించాలనే పట్టుదలతోనే పూర్తిచేశాను’. రైడ్‌లో భాగంగా ఆమె కాలేజీలకు వెళ్లి విద్యార్ధులను కలిశారు. విషాదఛాయలు గోల్కొండ: సనా ఇక్బాల్ మృతితో టోలిచౌకి అల్‌హస్నాత్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాలనీలో తెలిసినవారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే అమ్మాయి మృతి చెందిందన్న విషయం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఆమె ఉపయోగించే ద్విచక్ర వాహనం ఇంటి ముందు పార్క్ చేసి ఉంది. వాహనాన్ని చూసిన వారు సనా ఇక్బాల్‌ను గుర్తు చేసుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. అనుమానంగా ఉంది మంగళవారం తెల్లవారు జామున 2.30 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన సనా కారు పార్క్ చేస్తూ నాకు కాల్ చేసింది. అప్పటికే ఆమె భర్త నదీం కూడా అక్కడ ఉన్నాడు. ఆమె కోసమే అతడు వచ్చినట్లు నాకు అర్ధమైంది. ఆ సమయంలో అతనితో గొడవ పడడం మంచిది కాదని, తాను అతనితో కలిసి వెళ్తానని తన కొడుకును, లాప్‌టాప్‌ను తీసుకెళ్లాలని అక్క నాతో చెప్పింది, నేను అలాగే బాబును తీసుకొని ఇంట్లోకి వచ్చాను. సనా ఆమె భర్తతో కలిసి బయటకు వెళ్లింది. ఉదయం 7 గంటలకు సనా ప్రమాదానికి గురైనట్లు నదీం ఫ్రెండ్ అద్నాన్ వచ్చి చెప్పాడు. ఆసుపత్రికి కెళ్లాం. అక్క తీవ్రంగా గాయపడింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్ చెప్పాడు. కానీ నదీం మాత్రం క్షేమంగా కనిపించాడు. నదీం మా అక్కను చంపేశాడని అనుమానంగా ఉంది. గతంలోనూ నదీంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – సబ, సనా చెల్లెలు ఫియర్లెస్.. తను చాలా ధైర్యవంతురాలు. సనాను వాండరర్ గ్రూప్‌కి నేను పరిచయం చేశాను. మొదటి రోజు నుంచి తాను చాలా బాగా రైడ్ చేసేది. ఒంటరిగా దేశమంతా తిరిగింది. భయం అన్నది తెలియదు. అసలు తను లేదనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. – రాహుల్ సక్సేనా, (సనా మిత్రుడు) డేర్ డెవిల్... నాకు కూతుళ్లు లేరు. ఆ లోటు సనాని చూసినప్పుడు తీరిందనిపించేది. ఎవరికి పరిచయం చేసినా నా కూతురు అనే చెప్పేవాడిని. ఎంతో గౌరవంగా మెలిగేది. ఆల్ ఇండియా టూర్లో మగవాళ్లు కూడా రైడ్ చేయలేని దారుల్లో, పరిస్థితుల్లో ఒంటరిగా పయనించింది. ఆమెకి నా సెల్యూట్. ఆమె లేకపోవటం మా రైడర్స్‌కి తీరని లోటు – లలిత్‌జైన్, వాండరర్స్ రైడర్ గ్రూప్ ఓ కళాశాలలో సనా...(ఫైల్) , సాహసయాత్రకు వెళ్తూ..(ఫైల్) -
బుల్లెట్ రాణి అనుమానాస్పద మృతి..
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ బుల్లెట్ రైడర్, ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న మోటివేటర్ సనాఇక్బాల్(32) మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మరణించారు. తనతో వేరుగా ఉంటున్న భర్త అబ్దుల్ నదీమ్‌తో కలసి సనా ప్రయాణిస్తున్న కారు నార్సింగిలోని సన్‌సిటీ వద్ద డివైడర్‌ను ఢీ కొంది. ఈ ఉదంతంలో సనా తీవ్రగాయాలతో మరణించగా.. నదీమ్ గాయాలతో చికిత్స పొందుతున్నారు. అయితే తన కుమార్తెను ఆమె మాజీ భర్తే హత్య చేశాడని సనా తల్లి షాహీన్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుటుంబీకులు వచ్చి ఫిర్యాదు చేస్తే సంబంధిత ఆరోపణలపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఏడాదిగా దూరంగానే.. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన సనాఇక్బాల్, అబ్దుల్ నదీమ్(37) హైటెక్ సిటీ ప్రాంతంలోని వేర్వేరు కార్యాలయాల్లో పని చేస్తున్నారు. కొంతకాలంగా ఇరువురూ దూరంగా ఉంటున్న ప్పటికీ.. వీరి కుమారుడు కొన్ని రోజులు తండ్రి వద్ద.. మరికొన్ని రోజులు తల్లి వద్ద ఉంటు న్నాడు. లేడీ బైక్ రైడర్ అయిన సనా గతంలో దేశవ్యాప్తంగా బైక్‌పై సంచరిస్తూ ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించారు. నగరం లోనూ అనేక లాంగ్ డ్రైవ్ బైక్ రైడింగ్‌ల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం భార్యాభర్తలు వేర్వేరుగా టోలిచౌకి ప్రాంతంలోనే నివసి స్తున్నారు. అప్పుడప్పుడు ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకునే వారు. సోమవారం రాత్రి విధులు ముగించుకున్న నదీమ్ అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో సనా ఇంటి వద్దకు వచ్చాడు. అప్పుడే విధుల నుంచి వచ్చిన ఆమె సైతం కుమారుడికి అవసరమైన పాలు ఖరీదు చేయడానికి సోదరితో కలసి బయటకు వచ్చారు. అక్కడకు వెళ్లిన నదీమ్ లాంగ్‌డ్రైవ్‌కు వెళ్దామంటూ సనాను తీసుకువెళ్లాడు. నదీమ్‌కు చెందిన ఫియట్ కారు (టీఎస్13ఈసీ2142)లో ఇరువు రూ బయలుదేరారు. లాంగ్ డ్రైవ్ కోసం గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ మీదుగా వెళ్లి అప్పా జంక్షన్ వద్ద దిగి రేడియల్ రోడ్డు ద్వారా బండ్లగూడ, పీరంచెరువు దాటి హైదర్షాకోట్ వద్ద ప్రధాన రహదారి మీదికి చేరుకున్నారు. అక్కడి ఆర్మీ స్కూల్ మలుపు వద్ద తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వీరి వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. దాని మధ్యలో ఉన్న స్తంభాన్ని బలంగా తాకింది. డ్రైవింగ్ సీటులో ఉన్న నదీమ్‌కు గాయాలు కాగా.. ఎడమ వైపు ముందు సీట్లో కూర్చున్న సనా తీవ్రంగా గాయపడింది. ఆమె తల, ఛాతీ భాగాల్లో బలమైన గాయాలయ్యాయి. ఆ మార్గంలో వెళ్తున్న వాహనచోదకుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వాహనంలో ఇరుక్కుపోయిన ఇరువురినీ బయటకు తీసి ‘108’ద్వారా నానల్‌నగర్‌లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సనా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. నదీమ్ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. సనా మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. హత్యే అంటున్న కుటుంబీకులు.. సనాది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లి షాహీన్ ఆరోపిస్తున్నారు. సనా భర్త నదీమ్‌కు దూరంగా ఉంటోందని, తన కుమారుడితో కలసి జీవిస్తోందని చెప్పారు. టోలిచౌకి ప్రాంతంలోనే తమ ఇంటికి దాదాపు కిలోమీటర్ దూరంలో నదీమ్ నివసిస్తున్నాడని ఆమె మీడియాకు తెలిపారు. సోమవారం రాత్రి తమ ఇంటికి వచ్చిన నదీమ్ కుమారుడి విషయం మాట్లాడాలంటూ తీసుకువెళ్లాడని చెప్తున్నారు. తన భర్త వేళకాని వేళలో తమ ఇంటికి వస్తూ వేధిస్తున్నారని, దుర్భాష లాడుతున్నట్లు సనా మేలో హుమాయున్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ చేసిన పోలీసులు భరోసా కేంద్రంలోనూ కౌన్సెలింగ్ ఇప్పించారు. అనుమానాస్పదంగా ప్రమాద తీరు.. సాధారణంగా ఏ వాహనమైనా రోడ్డుకు ఎడమ వైపు ప్రయాణిస్తుంది. అలాంట ప్పుడు రెండు రోడ్ల మధ్య ఉండే డివైడర్ వాహనానికి కుడి వైపు ఉంటుంది. కారు డివైడర్‌ను ఢీ కొంటే కుడి వైపు దెబ్బతినాల్సి ఉంది. అయితే సనా, నదీమ్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొన్నప్పుడు ఎడమ వైపు పూర్తిగా ధ్వంసమైంది. డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాన్ని ఎడమ వైపు బలంగా ఢీ కొట్టినట్లు ప్రమాద స్థలిని బట్టి తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఆమె తల, ఛాతీ, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాలే ఆమె ప్రాణాలు తీశాయని పోలీసులు చెప్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఎడమ పక్క పూర్తిగా ధ్వంసమైనా.. కుడి వైపు(డ్రైవింగ్ సీటు) కొద్ది మేర ధ్వంసమైంది. కారు ముందు భాగంలో ఎలాంటి డ్యామేజ్ లేకపోవడం అనుమానా లకు తావిస్తోంది. ప్రమాద స్థలి వద్ద వాహనానికి సడన్ బ్రేక్ వేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నార్సింగి పోలీసులు మంగళవారం సాయంత్రం సీసీ ఫుటేజీల సేకరణ ప్రయ త్నాలు చేపట్టారు. అప్పా నుంచి ప్రమాదం జరిగిన హైదర్షాకోట్ ఆర్మీ పాఠశాల క్రాసింగ్ వరకు దాదాపు 14 కెమెరాల సీసీ ఫుటేజీని సేకరించి పరిశీలిస్తు న్నారు. ఆలివ్ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న నదీమ్‌కు పక్కటెముకల వద్ద మాత్ర మే దెబ్బలు తగలటం అనుమానాలకు బలాన్నిస్తోంది. నదీమ్‌ను బుధవారం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించారు.. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో టోలిచౌకిలోని మా ఇంటికి వచ్చి సనాను బలవంతంగా నదీమ్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత గంటకే సన్‌సిటీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి సనా చనిపోయినట్టుగా తెలిసింది. అయితే రోడ్డు ప్రమాదానికి గురైన కారు ముందు భాగం అంతా బాగానే ఉంది. సనా కూర్చున్న ఎడమవైపు వాహనం పూర్తిగా దెబ్బతింది. నదీమ్‌కు మాత్రం ఎటువంటి దెబ్బలు తగల్లేదు. ఇదంతా చూస్తే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా కనబడుతోంది. మూడేళ్ల క్రితం వివాహమైన సనాను ఇష్టమొచ్చినట్టు కొడుతూ శారీరకంగా, మానసికంగా వేధిస్తుండటంతో ఏడాది నుంచి దూరంగా ఉంటోంది. అయినా నదీమ్ ఇంటికి తరచూ వస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు.– ప్రొఫెసర్ షాహీన్ ఖాన్, సనా తల్లి సనా మృతి అసలు వెనుక ఏం జరిగింది ? -
బుల్లెట్ రాణి అనుమానాస్పద మృతి
-
సూసైడ్...రైడ్
నవంబర్ 23, 2015 హైదరాబాద్ నుంచి బయలుదేరిన నగర యువతి సనాఇక్బాల్ యావత్ భారతాన్ని చుట్టి నేడు నగరానికి చేరుకుంటున్నారు. ఆరున్నర నెలలు... 100కు పైగా నగరాలు.. 40 వేల కిలోమీటర్లు.. ఒంటరిగా ప్రయాణం... ఎందుకీ యువతి ఇంతటి సాహసం చేసింది? ఏం అనుభవాలు మూటకట్టుకుని వస్తోంది? - ఓ మధు నెలల బాబును ఇంట్లో వదిలి పెట్టి ఈ యాత్ర చేపట్టడానికి ఈ తల్లికి బలమైన కారణం గొప్ప సంకల్పం, సందేశం రెండూ ఉన్నాయి. ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదనే సందేశంతో బయలుదేరిన సనా అనుభవాలు ఆమె మాటల్లోనే... ‘మా అమ్మ అడ్వకేట్. నాన్న కొన్నేళ్ల క్రితం చనిపోయారు. నా జీవితంలోనూ చాలా ఎత్తుపల్లాలున్నాయి. ఐదేళ్ల క్రితం నా జీవితం బతకడానికి పనికిరానిదనిపించేది. అయితే నేను డిప్రెషన్లో ఉన్నానని నాకు తెలియదు. సందేహం వచ్చి చెక్ చేసి చూసుకున్నా. నాలో డిప్రెషన్ లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్నా. కానీ విధిని ఎవరూ మార్చలేరు, దుఖాన్ని పక్కకు పెట్టి సంతోషం వైపు సాగేందుకు ప్రయత్నించా. అతి కష్టమ్మీద నాకు నేనుగా ఈ డిప్రెషన్ నుంచి బయటపడ్డా. అప్పుడు నాకు అర్థమైంది ఎలాంటి ఆలోచనలు డిప్రెషన్‌కి ఆ తర్వాత సూసైడ్‌కి దారి తీస్తాయో... అమ్మ ఒప్పుకోలేదు... తల్లిదండ్రులు తమ జీవితాల్లో ఉన్న చిరాకు, విసుగుని, అపజయాలను పిల్లల మీద చూపిస్తారు. పేరెంట్స్ సంతోషంగా లేకపోతే పిల్లల మీద ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. దేశంలో చాలామంది పిల్లల డిప్రెషన్‌కి కారణం ఇదే. తల్లిదండ్రులు విచారంగా, కోపంగా ఉండటం చూసి పిల్లలు డిప్రెషన్‌కి లోనవుతారు. ఆత్మహత్య ఏ సమస్యకి పరిష్కారం కాదనే నినాదంతో పాటు పిల్లల డిప్రెషన్‌కి కారణాలు అన్వేషిస్తూ ఈ రైడ్ ప్లాన్ చేశాను. ముందు మా అమ్మ దీనికి ఒప్పుకోలేదు. అయితే కొందరు డిప్రెషన్ బాధితుల విషయంలో నేను చూపిన చొరవ, వచ్చిన మార్పును అమ్మ గమనించింది. రైడ్‌కు ఓకే చెప్పింది. రైడ్‌లో కేంద్ర పాలిత ప్రాంత నగరాలు తప్ప అన్నీ చుట్టేశా. వివిధ రాష్ట్రాల్లోని కళాశాలల్ని సందర్శించా. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని కలిశా. డెరైక్ట్‌గా సూసైడ్ అనే విషయంపై మాట్లాడకుండా వాళ్ల మీద ఉండే ఒత్తిడిని విశ్లేషించా. చిన్న చిన్న కథలతో వారిలోని భయాలను, ఆందోళనలను తగ్గించేందుకు ప్రయత్నించా. వారికి అవసరమైన మనోనిబ్బరాన్ని అందించేందుకు నా వంతు కృషి చేశా. ప్రేమను పెంచిన రైడ్... భారత్ చాలా సేఫ్ కంట్రీ. ఇక్కడి స్త్రీలకు ఏ ఎంపవర్మెంట్ అవసరం లేదు. వీరికి దేశంలో ప్రతి చోటా గౌరవం ఉంది. నేను వెళ్లిన ప్రతి చోట ఆ గౌరవాన్ని, ఆదరణను పొందాను. ఆడపిల్లను అని ఎవరూ, ఎక్కడా తక్కువ చేసి చూడలేదు. తప్పుగా ప్రవర్తించలేదు. యూపీలో ఓ పెద్ద యాక్సిడెంట్ అయింది. దెబ్బలు తగిలి ముఖం బాగా పాడయింది. ఈ టూర్‌కి ముందు ఇలాంటి ప్రమాదం జరిగి ఉంటే తప్పకుండా డిప్రెషన్లోకి వెళ్లేదాన్ని. కానీ పాడైన ముఖం ఇప్పుడు నన్ను బాధ పెట్టడం లేదు. నన్ను నేను ఎలా ప్రేమించాలి, గౌరవించాలి, నాకేం కావాలి ఇవన్నీ ఈ రైడ్ నుంచి నేర్చుకున్న పాఠాలే. ఈ రైడ్‌లో అనుభవాలన్నీ రాయలంటే ఒక్క పుస్తకం సరిపోదు, సైకాలజీలో మాస్టర్స్ చేస్తున్నా. కార్పొరేట్ ట్రెయినర్‌గా ఉద్యోగం.. నెలకు 50 వేల జీతం. 7 నెలలుగా జీతం లేదు. ఈ టూర్‌కి లక్షాఎనభై వేలకు పైగా ఖర్చు అయ్యింది. సేవింగ్స్ అన్నీ ఖాళీ అయ్యాయి. కానీ ఇప్పుడు జీవితానికి కావలసిన విలువైన అనుభవాలు, పాఠాలు మాత్రం నా దగ్గరున్నాయి. పాజిటివ్‌గా ఉండండి... ⇒ఎవరితో అయినా ఆత్మవిశ్వాసంతో, మృదువుగా మాట్లాడండి. ⇒ఫ్రెండ్లీగా, ఫ్రెండ్‌గా ఉండటానికి తేడా తెలుసుకుని అందరితో స్నేహభావంతో మెలగండి. ⇒బాడీలాంగ్వేజ్, మాటతీరు చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. ⇒కాన్ఫిడెంట్‌గా ఉండే అమ్మాయిని చూసి ఎవరూ ఆకతాయిగా మసలుకోరని మాత్రం ⇒అనుభవ పూర్వకంగా చెప్పగలను. -సనా ⇒సూసైడ్ దేనికి పరిష్కారం కాదు... మరి సూసైడ్‌కి పరిష్కారం... తనలా జీవితం నుంచి అనుభవాల నుంచి స్వయంగా స్ఫూర్తి పొందటమే అని వివరిస్తున్న సనా దేశ పర్యటన ముగించి నేడు నగరానికి తిరిగివస్తున్నారు. తమ వాండరర్ని సిటీ బుల్లెటీర్స్ నేడు ఘనంగా స్వాగతించనున్నారు.