ఉంగరం జారె... కరెంటు పోయె... | Cameron Diaz: the gold-plated romcom queen lands her husband - at long last | Sakshi
Sakshi News home page

ఉంగరం జారె... కరెంటు పోయె...

Published Sun, Jan 11 2015 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 PM

ఉంగరం జారె... కరెంటు పోయె...

ఉంగరం జారె... కరెంటు పోయె...

శుభమా అని పెళ్లి చేసుకుంటున్నప్పుడు కరెంటు పోతే ఎలా ఉంటుంది? పోనీ పోయిన కరెంటు వచ్చిన తర్వాత కాబోయే భర్త వేలికి తొడగాల్సిన ఉంగరం జారిపడితే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు హలీవుడ్ హాట్ స్టార్ కామరూన్ డయాజ్ చక్కగా సమాధానాలివ్వగలుగుతారు. ఎందుకంటే.. ఇటీవల ఈ రెండూ ఆమెకు అనుభవంలోకి వచ్చాయి. సంగీతదర్శకుడు బెంజీ మాడ్డెన్‌తో ఇటీవల ఆమె వివాహం జరిగింది.

కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో గల బెంజీ స్వగృహంలో ఈ వేడుక జరిగింది. ఉంగరాలు మార్చుకునే సమయానికి కరెంటు పోయి, 20 సెకన్లలో వచ్చేసిందట. ఆ తర్వాత మాడ్డెన్ ఐదేళ్ల మేనల్లుడి చేతిలో ఉన్న ఉంగరాలు జారిపోయాయట. దాంతో మాడ్డెన్ సోదరులు గ్రూమ్ బెంజీ, బెస్ట్ మాన్ రింగులు తిరుగుతూ దూసుకెళుతున్న రింగులను పట్టుకోవడానికి తిప్పలు పడిన వైనం అతిథులుందర్నీ నవ్వించిందట. చివరికి ఉంగరాలను దక్కించుకుని సోదరుడి చేతిలో పెట్టడంతో వివాహ తంతు పూర్తయ్యింది. అప్పటివరకూ సీరియస్‌గా ఉన్న కామరూన్  తర్వాత కూల్ అయ్యారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement