
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ ఇటీవల ట్వీటర్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తన అభిమానులకు మరింత చేరువయ్యేందుకు సోషల్ మీడియా అవసరమని భావించిన చిరంజీవి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 25న ట్విటర్ ఖాతా తెరిచాడు. ఆయన వెంటే కుమారుడు రామ్ చరణ్ కూడా మార్చి 26న ట్వీటర్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇక సోషల్ మీడియాలో అడుగుపెట్టినప్పటి నుంచి చిరంజీవి తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాదు సమాజంలో జరిగే సంఘటనలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు.
(చదవండి : చార్మి బర్త్‌డే : పూరీ ఎమోషనల్ ట్వీట్)
మరో వైపు రామ్ చరణ్ కూడా తండ్రి బాటలో పయణిస్తున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం ట్విట్టర్‌లో ఒకేలా దూసుకెళ్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య 5 లక్షలు దాటింది. వీరిద్దరూ ఒకేసారి 5 లక్షల ఫాలోవర్ల మార్కును అందుకోవడం చూసి మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, చరణ్ కన్నా చిరంజీవికి కాస్త ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్వీట్ల సంఖ్యలోనూ చిరంజీవిదే పైచేయి. చిరంజీవి 112 ట్వీట్లు చేయగా.. చరణ్ 18 ట్వీట్లు మాత్రమే చేశారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో నటిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’లో నటిస్తున్నాడు.
(చదవండి : మహేశ్ లుక్‌పై బండ్ల గణేష్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment