సైరా.. నీటి అడుగున పోరాటం | Chiranjeevi to Perform Underwater Fight Scenes In Sye Raa | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 14 2018 2:27 PM | Last Updated on Fri, Dec 14 2018 2:27 PM

Chiranjeevi to Perform Underwater Fight Scenes In Sye Raa - Sakshi

ఖైదీ నంబర్‌ 150 సినిమాతో గ్రాండ్‌ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం చారిత్రక కథగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. చిరు డ్రీమ్‌ ప్రాజెక్ట్ కావటంతో చాలా కష్టపడి ఎంతో రిస్క్‌ చేసి నటిస్తున్నాడు. అంతేకాదు ఈసినిమాలో ఓ అండ్‌ వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా ఉందని తెలుస్తోంది.

త్వరలో ముంబైలో జరగబోయే షెడ్యూల్‌ లో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన స్విమ్మింగ్‌ పూల్‌లో ఆ పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు సుధీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement