![Chiranjeevi Sye Raa Narasimha Reddy Digital and Satellite Rights Sold For Bomb - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/21/Sye%20Raa.jpg.webp?itok=60rj841G)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించి రకరకాల వార్తలు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.
తాజాగా సైరా డిజిటల్, శాటిలైట్ రైట్స్‌కు సంబంధించిన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సైరా డిజిటల్ హక్కులు 40 కోట్లకుపైగా ధర పలికినట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగుతో పాటు ఇతర భాషల శాటిలైట్ హక్కులు అన్ని కలిపి 70 కోట్లకు పైగా పలికాయట. అంటే కేవలం డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా సైరా 100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఇక థియెట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుండటంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రక చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ కావటంతో చరణ్ ఖర్చుకు ఏ మాత్రం వెనకాడుకుండా 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించాడు. చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుధీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, తమన్నా, రవి కిషన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment