
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమర వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు అభిమానుల సమక్షంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మెగా తనయుడు రామ్‌చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, సుధీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment