
బ్రిటీషర్లతో ‘సైరా’ పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పోరు ఎలా ఉందంటే... రాత్రి, పగలు అన్న తేడా లేకుండా సాగుతోంది. బ్రిటీషర్లపై ఆదిపత్యం కోసం ‘సైరా’ అలుపెరుగని పోరాటం చేస్తున్నారట. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘సైరా’. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తనయుడు, హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా స్టార్ట్ అయిన ఈ సినిమా యాక్షన్ షెడ్యూల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గ్రెగ్ పావెల్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం హీరో చిరంజీవిపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ముఖ్యంగా నైట్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా తెల్లవారుజాము మూడు గంటల వరకు షూటింగ్ జరిపారట. ఈ నైట్ షూట్‌లో ఒక్క డల్ మూమెంట్ కూడా లేదని, యూనిట్ అంతా ఉత్సాహంగా పని చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, తమన్నా, విజయ్‌సేతుపతి, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ‘సైరా’ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుందని సమాచారమ్.
Comments
Please login to add a commentAdd a comment