చిరు స్టెప్పులు అదుర్స్‌.. స్పాట్‌ వీడియో లీక్‌! | chiru movie shooting video leak | Sakshi
Sakshi News home page

చిరు స్టెప్పులు అదుర్స్‌.. స్పాట్‌ వీడియో లీక్‌!

Dec 10 2016 7:41 PM | Updated on Sep 4 2017 10:23 PM

చిరు స్టెప్పులు అదుర్స్‌.. స్పాట్‌ వీడియో లీక్‌!

చిరు స్టెప్పులు అదుర్స్‌.. స్పాట్‌ వీడియో లీక్‌!

ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు మళ్లీ వెండితెరపై తళుక్కుమనబోతున్నారు.

ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్న మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు మళ్లీ వెండితెరపై తళుక్కుమనబోతున్నారు. 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' అంటూ 150 చిత్రంతో మరోసారి తన అభిమానుల్ని అలరించబోతున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 150వ సినిమా 'ఖైదీ నంబర్‌ 150'. ఇటీవల రిలీజ్‌ అయిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తున్నది.

మరోసారి మెగాస్టార్‌ తనదైన స్టైల్‌తో, స్టామినాతో దూసుకుపోనున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన లీకైన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 'ఖైదీ నంబర్‌ 150' సినిమాలోని ఓ పాటకు చిరంజీవి, కాజల్‌ స్టెప్పులు వేస్తుండగా.. షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న ఓ వ్యక్తి దానిని రహస్యంగా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో లీక్‌ కావడంతో ఇది బాగా హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement