'అతడి భార్య చాలా అదృష్టవంతురాలు' | Chris is a very good kisser, his wife is a lucky woman: Jessica Chastain | Sakshi
Sakshi News home page

'అతడి భార్య చాలా అదృష్టవంతురాలు'

Published Thu, Apr 21 2016 1:03 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

'అతడి భార్య చాలా అదృష్టవంతురాలు'

'అతడి భార్య చాలా అదృష్టవంతురాలు'

లాజ్ ఏంజెలెస్: తనతో కలిసి 'ది హంట్స్ మాన్: వింటర్స్ వార్' సినిమాలో నటించిన క్రిస్ హెమ్సవర్త్ ను హాలీవుడ్ నటి జెసికా చాస్టెయిన్ పొగడ్తల్లో ముంచెత్తింది. హెమ్సవర్త్ 'గుడ్ కిస్సర్' అని కితాబిచ్చింది. అతడు మనోహరుడు, పరిపూర్ణమైన నటుడు అంటూ వర్ణించింది. 'హెమ్సవర్త్ చూడడానికి అందంగా ఉండడమే కాదు హాస్యగాడు కూడా. అతడికి అన్నివిధాల అనువైన కుటుంబం ఉంది. అతడు గొప్ప తండ్రి' అని ప్రశంసించింది.

తాజా చిత్రంలో అధర చుంబనాల గురించి అడిగినప్పడు.. 'అతడు గుడ్ కిస్సర్. ఘాటు ముద్దులు ఇవ్వడంలో దిట్ట. అతడి భార్య ఎల్సా చాలా అదృష్టవంతురాల'ని పేర్కొంది. హెమ్సవర్త్ కారణంగానే ది హంట్స్ మాన్' సినిమాలో నటిస్తున్నానని తెలిపింది. నటన అంటే తనకు ప్రాణమని, తన జీవితంలో 80 శాతం సినిమాల్లో నటించేందుకే వినియోగిస్తున్నానని వెల్లడించింది. పనిభారంతో ఎక్కువగా ఒత్తడికి గురవుతుంటానని, అందుకే వినోదం కావాలని కోరుకుంటున్నట్టు జెసికా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement