గిరిబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, సారధి, కృష్ణంరాజు
‘‘సారధితో నాది 50 ఏళ్ల స్నేహం. హీరో అవుదామని ఇండస్ట్రీకొచ్చి హాస్య నటుడయ్యారు. ఆయన నవ్వులో ప్రత్యేకత ఉంది. అదే ఆయన్ను హాస్య నటుణ్ణి చేసింది. ఆ నవ్వు చాలామందికి స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలిచింది. సారధిగారు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి’’ అని నటుడు కృష్ణంరాజు అన్నారు. ప్రముఖ నటులు కె.జె సారధిపై రచయిత, చిత్రకారుడు రాంపా రచించిన ‘సినీ స్వర్ణయుగంలో సారధి’ పుస్తకాన్ని కృష్ణంరాజు ఆవిష్కరించగా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు స్వీకరించారు. ఈ పుస్తకాన్ని కృష్ణంరాజుకు అంకితమిచ్చారు రాంపా.
సారధి మాట్లాడుతూ– ‘‘ఏమీ లేకుండా చిత్రపరిశ్రమకు వచ్చి ఇంతటివాడినయ్యా. 378 సినిమాల్లో నటించా. ఈ స్థానంలో ఉన్నానంటే కారణం ప్రేక్షకులే. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, నాగేశ్వరరావు, రేలంగి, కృష్ణ, చిరంజీవిలతో నటించా. వెంకటేశ్ ‘గణేష్’ చిత్రం తర్వాత సినిమాలు చేయలేదు. కృష్ణంరాజు ‘భక్తకన్నప్ప’ నా జీవితాన్నే మార్చేసింది. తర్వాత చాలా మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించాను’’ అన్నారు. ‘‘సారధి, ప్రభాకర్‌రెడ్డిగారి కృషి వల్లే చిత్రపురి కాలనీ ఏర్పాటైంది’’ అన్నారు పరుచూరి వెంకటేశ్వరరావు. నటుడు గిరిబాబు. కృష్ణంరాజు సతీమణి శ్యామల, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, నిర్మాత సురేశ్‌కొండేటి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment