కొండవలస అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యంతో సోమవారం రాత్రి మరణించిన హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు గురువారం ఎర్రగడ్డ శ్మశానవాటికలో నిర్వహించారు. అమెరికాలో ఉంటున్న కొండవలన కుమార్తె రావటం ఆలస్యం కావటంతో ఆయన భౌతిక ఖాయన్ని నిమ్స్ మార్చురిలో ఉంచారు. ఈరోజు ఉదయం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన కుటుంబ సభ్యులు కొండవలస భౌతికఖాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
విశాఖ హార్బర్ లో ఉద్యోగిగా పని చేసిన కొండవలస రంగస్థల అనుభవంతో 58 ఏళ్ల వయసులో ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు సినిమాతో సినీ నటుడిగా మారారు. 11ఏళ్ల సమయంలో 300లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఎన్నో మరపురానిపాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.