కాలనీలో కామెడీ
రొమాంటిక్ హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘డాలర్స్ కాలనీ’. ప్రిన్స్, నిఖితాపవార్ జంటగా నటిస్తున్నారు. శ్రీచంద్ ముల్లా దర్శకుడు. ఎస్.రత్నమయ్య, టి.గణపతిరెడ్డి నిర్మాతలు. హైదరాబాద్ సారథీ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. హీరోహీరోయిన్లు, అలీ, సయాజీ షిండే, హేమ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. కామెడీ, గ్రాఫిక్స్ యువతరాన్ని ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం రాత్రి నేపథ్యంలో పాటని చిత్రీకరిస్తున్నాం. దీంతో 90 శాతం షూటింగ్ పూర్తవుతుంది’’ అని చెప్పారు. ఆగస్ట్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.