రావడం ఖాయమే! | COMINIG MY DAUGHTER IN MOVIES- SRIDEVI | Sakshi
Sakshi News home page

రావడం ఖాయమే!

Published Wed, Feb 17 2016 10:31 PM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

రావడం ఖాయమే! - Sakshi

రావడం ఖాయమే!

సెలబ్రిటీలకు ఎంత క్రేజ్ ఉంటుందో వాళ్ల పిల్లలకు కూడా అంతే క్రేజ్. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు?  నటవారసులు అవుతారా? లేకే వేరే వృత్తిలో స్థిరపడతారా? లాంటి చర్చలు జరుగుతుంటాయి. ఫలితంగా సెలబ్రిటీలతో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడూ వార్తల్లో వ్యక్తులే. అలా గత ఐదారేళ్లల్లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన వాళ్లల్లో సీనియర్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ ఉంది. తల్లితో పాటు జాన్వీ పబ్లిక్‌గా కనిపించడం ఎక్కువే. అచ్చం సినిమా హీరోయిన్‌లా గ్లామరస్‌గా డ్రెస్ చేసుకుని కనువిందు చేస్తుంటుంది జాన్వీ. అందుకే, తల్లి బాటలో కూతురు కూడా కథానాయిక కావడం ఖాయం అని చాలామంది ఫిక్స్ అయ్యారు. అందుకే, అప్పట్లో రామ్‌చరణ్ తొలి చిత్రం ద్వారా జాన్వీ కథానాయికగా పరిచయమవుతుందనే వార్త వినిపించింది. ఆ తర్వాత నాగచైతన్య తొలి చిత్రంతోనే జాన్వీ పరిచయం కావడం ఖాయమన్నారు. ఆ రెండూ జరగలేదు. కట్ చేస్తే అఖిల్ తొలి సినిమాకీ జాన్వీ పేరు వినిపించింది. ఆ మధ్య మణిరత్నం తీసిన ‘ఓకే బంగారం’ ఈ బ్యూటీ ఇంట్రడక్షన్ సినిమా అవుతుందని ఊహాగానాలు వచ్చాయి. చివరకు అన్నీ వదంతులుగానే మిగిలిపోయాయి. కానీ, ఈసారి మాత్రం జాన్వీ తెరంగేట్రం ఖాయమని హిందీ సినీ వర్గాలు చెబుతున్నాయి.

దానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ‘ది లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్’లో జాన్వీ శిక్షణ పొందుతోందట. గత ఏడాది అక్టోబర్‌లో జాన్వీ అక్కడికెళ్లినట్లు సమాచారం. త్వరలోనే అక్కడ నట శిక్షణ కోర్సు పూర్తి చేసుకొని, ఇండియాకు తిరిగి వస్తుందట. శ్రీదేవి కూతురంటే మాటలు కాదు కాబట్టి, జాన్వీ పరిచయ చిత్రాన్ని నిర్మించడానికి హిందీ రంగానికి చెందిన పలువురు అగ్ర నిర్మాతలు ఇప్పటికే కర్చీఫ్ వేశారట. అఫ్‌కోర్స్ జాన్వీ దక్షిణాదిన సినిమా చేస్తానంటే, ఇక్కడి నిర్మాతలు కూడా పోటీపడే అవకాశం లేకపోలేదు. ఇక, జాన్వీ యాక్టింగ్ పట్టా పుచ్చుకోవడమే ఆలస్యం... కెమేరా ముందుకు వచ్చేయడం ఖాయమన్నమాట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement