చెన్నై, పెరంబూరు: బిగిల్ చిత్ర వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బిగిల్. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవల స్థానిక తాంబరంలోని సాయిరాం ఇంజినీరింగ్ కళాశాలతో నిర్వహించారు. అక్కడి నుంచే వివాదం మొదలైంది. ఆ వేదికపై నటుడు విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు విజయ్‌పై విమర్శల దాడి చేస్తున్నారు. ఆ వివాదం సద్దుమణగక ముందే మరో అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది.
అనుమతిపై కళాశాలకు నోటీసులు
విజయ్ చిత్రం బిగిల్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడానికి అనమతి ఎలా ఇస్తారని సాయిరామ్ ఇంజినీర్ కళాశాల నిర్వాహానికి ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఉప కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఈ చర్చలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అంతే కాదు నటుడు విజయ్ వ్యాఖ్యలను సమర్థిస్తోంది. ఆ కళాశాలకు జానీ చేసిన నోటీసులను వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎస్.అళగిరి ఒక బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సాయిరామ్ ఇంజినీరింగ్ కళాశాల వెలుపలే జరిగింది. అయినా ఆ కళాశాలకు నోటీసులు జారీ చేశారు. ఆ కార్యక్రమంలో వేలాది మంది అభిమానుల మధ్య నటుడు విజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని తప్పుగా భావించి దానికి ప్రతీకారం తీర్చుకునే విధంగా ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ప్రవర్తిస్తోంది. రాజకీయం చేస్తోందని ఆరోపించారు.
అది రాజకీయ కార్యక్రమం కాదని, ప్రైవేట్ కార్యక్రమం. కాబట్టి నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇలా తమిళనాడులో జరిగిన పలు కార్యక్రమాల్లో పలువురు రాష్ట్ర, కేంద్రానికి చెందిన రాజకీయ నాయకులు పాల్గొన్నారని, అప్పుడు వాటిని వ్యతిరేకిస్తూ ఎందకు నోటీసులు ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి అనుమతి ఉంటోంది. నటుడు విజయ్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు. ఏ పార్టీకి మద్దతుగా లేరు. లక్షలాది మంది యువకుల అభిమానాన్ని పొందిన అద్భుత నటుడు. ఆయన ఏ రాజకీయ పార్టీని ప్రస్తావిస్తూ మాట్లాడలేదు. అలాంటిది మంత్రి జయకుమార్ ఏదేదో ఊహించుకుని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఏది చూసినా భయపడే పరిస్థితిలో అన్నాడీఎంకే నాయకులు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ స్టెల్లా కళాశాలలో విద్యార్థులతో మాట్లాడడాన్ని రాజకీయం చేసి ఆ కళాశాలకు నోటీసులు జారీ చేశారు. అప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిచాయి. తాజాగా సాయిరామ్ కళాశాలకు జారీ చేసిన నోటీసులను వెనిక్కి తీసుకోకుంటే త్రీవ పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది అని కేఎస్.అళగిరి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment