'పీ.కే.' నగ్న పోస్టర్పై వివాదం.. అమీర్పై కేసు | controversy on Aamir Khan's PK nude poster | Sakshi
Sakshi News home page

'పీ.కే.' నగ్న పోస్టర్పై వివాదం.. అమీర్పై కేసు

Published Sat, Aug 2 2014 7:46 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'పీ.కే.' నగ్న పోస్టర్పై వివాదం.. అమీర్పై కేసు - Sakshi

'పీ.కే.' నగ్న పోస్టర్పై వివాదం.. అమీర్పై కేసు

బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'పీ.కే.' విడుదలకు ముందే వివాదాలు సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన 'పీ.కే.' ఫస్ట్లుక్ వివాదాస్పదంగా మారింది. అమీర్ ఖాన్ ఒంటిమీద నూలు పోగులేకుండా రైలు పట్టాలపై నిలబడి కోపంగా చూస్తున్నట్టుగా ఆ పోస్టర్లో ఉంది. ఒక పాత టేప్ రికార్డర్ ను మాత్రమే అడ్డుపెట్టుకున్నాడు. అమీర్ ఖాన్పై చర్యలు తీసుకోవాల్సింది కోరుతూ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ కోర్టులో కేసు నమోదైంది.


రాజ్కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న 'పీ.కే.' సినిమాలో అమీర్ గ్రహాంతరవాసిగా నటిస్తున్నాడు. సినిమా ఇంట్రడక్షన్ సీన్ లోనే ఆమిర్ బేర్ బాడీతో కన్పించనున్నాడు. ఇంతకుముందెన్నడూ అతడు ఇలాంటి సీన్లు చేయలేదు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై వ్యంగాస్త్రంగా ఈ సినిమాను హిరానీ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఆమిర్, హిరానీ కాంబినేషన్ లో వచ్చిన త్రీఇడియట్స్ ఘన విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement