CoronaVirus: Actor Venkatesh Requests People to not to Abandon Their Pets - Sakshi
Sakshi News home page

వాటిని ప్రేమించాల్సిన స‌మ‌యం ఇదే..

Published Wed, Apr 15 2020 3:34 PM | Last Updated on Wed, Apr 15 2020 6:41 PM

Corona : Actor Venkatesh Requested People Not to Leave Their Pets - Sakshi

దేశంలో కరోనా వైర‌స్ రోజురోజుకు విజృంభిస్తోంది. కోవిడ్ కార‌ణంగా ఫేక్ న్యూస్‌లు కూడా తెగ హ‌ల్‌చ‌ల్ అవుతున్నాయి. జంతువుల నుంచి కరోనా వ్యాప్తి చెందుతుందనే పుకార్లతో చాలా మంది తమ ఇంట్లో ఇప్పటి వరకు ఎంతో అపురూపంగా చూసుకుంటున్న కుక్కలను వ‌దిలించుకుంటున్నారు. ఇంకొంత మంది అయితే వీధిల్లోకి త‌రిమేస్తున్నారు కూడా. ఇలాంటి ఘ‌ట‌న‌లు హీరో వెంక‌టేష్ దృష్టికి వెళ్ల‌డంతో ఆయ‌న అస‌హ‌నానికి లోన‌య్యారు. ఈ క‌ష్ట‌కాలంలో పెంపుడు జంతువుల‌కు మ‌న అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇది కేవలం మనుషులకు మాత్రమే వచ్చిన కష్టము కాదు.. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ఇది కష్ట సమయమే అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే అపోహల కారణంగా చాలా మంది తమ ఇంట్లో ఉన్న జంతువులను తరిమివేయడం దారుణమైన విష‌య‌మ‌ని పేర్కొన్నారు. మనతో సమానమైన జంతువులను ప్రేమించాల్సిన సమయం ఇదే.. లాక్‌డౌన్ సమయంలో వాటితో కొంత సమయాన్ని కేటాయించండి అంటూ ట్వీట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement