ముంబై: తనతోపాటు కుటుంబం కరోనా బారినపడ్డామని లండన్‌లో చిక్కుకుపోయిన హిందీ నటుడు పురబ్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. అయితే, తామంతా గత బుధవారం 14 రోజుల స్వీయ నిర్బంధం పూర్తి చేసుకున్నామని.. కోవిడ్ నుంచి కోలుకుంటున్నామని తెలిపాడు. తొలుత తన కూతురు ఇనాయ (4) అస్వస్థతకు గురవడంతో సాధారణ జలుబు, జ్వరం అనుకున్నామని.. కానీ అది కరోనాగా నిర్ధారణ అయిందని పురబ్ చెప్పుకొచ్చాడు. కరోనా సోకితే భయాందోళనకు గురికావొద్దని తెలిపేందుకు ఇన్‌స్టా పోస్టు చేశానని పేర్కొన్నాడు.
‘నా కూతురు ఇనయకు జ్వరం వచ్చింది. మూడు రోజులపాటు చిన్నారి ఇబ్బంది పడింది. తమ ఫ్యామిలీ డార్టర్‌ను సంప్రదిస్తే ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నాయని తేల్చాడు. దాంతో కుంటుంబమంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాం. మరిన్ని పరీక్షలు చేసి ఇనయతోపాటు నా భార్య లూసీ పేటన్‌కు, తర్వాత నాకూ వైరస్ సోకిందని నిర్ధారించాడు. కోవిడ్ లక్షణాలు సాధారణ జ్వరం, జలుబు మాదిరిగానే ఉన్నాయి. కాకపోతే ఊపిరితీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది. ఏడాది వయసున్న నా కొడుకు ఓసియాన్‌కు కూడా తీవ్రమైన జ్వరం వచ్చింది. అతనికి కూడా వైరస్ సోకింది. అయితే, మూడు రాత్రులు జ్వరంతో బాధపడిన అనంతరం.. ఐదోరోజు అతనికి జ్వరం తగ్గింది.
ఫోన్‌లో డాక్టర్ సలహాలు, సూచనలు క్రమం తప్పకుండా పాటిస్తున్నాం. లండన్‌లో మాకు తెలిసిన మరికొందరికి కూడా వైరస్ సోకిందని తెలిసింది. మీలో భయాల్ని తగ్గించే ప్రయత్నం చేసేందుకే ఈ పోస్టు పెడుతున్నా. గత బుధవారం మా స్వీయ నిర్బంధం ముగిసింది. అయినప్పటికీ, అందరికీ దూరంగా ఉంటాం. ఇప్పటివరకైతే ఆరోగ్యంగానే ఉన్నాం. త్వరలో పూర్తిగా కోలుకుంటాం అనుకుంటున్నా. రోజూ నాలుగు నుంచి ఐదు సార్లు వేడినీళ్ల స్నానం చేయడంతో రిలీఫ్‌గా అనిపించింది. గోరువెచ్చని నీటిలో ఉప్పు, అల్లం, పసుపు, తేనే కలిపి పుకిలిస్తున్నాం. వీటితోపాటు రెండు వారాల విశ్రాంతి కూడా మా రికవరీలో కీలకమైందిగా భావిస్తున్నా. ఇంటి వద్దే ఉంటూ క్షేమంగా ఉండండి. మన శరీరాలు వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉన్నాయని గుర్తుంచుకోండి. అయితే, ఒక్క విషయం ప్రతి కేసు దేనికదే ప్రత్యేకం. డాక్టర్ల సలహా.. విశ్రాంతి తప్పనిసరి’అని పురబ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment