మేడమ్ తుస్సాడ్స్ న్యూయార్క్ మ్యూజియంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమె చెల్లెలు అనీషాతో పాటు, ఆమె భర్త రణ్‌వీర్‌సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపిక దిగిన ఫొటో ఇది. ఇక దీపికా సినిమాల విషయానికి వస్తే... ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించనున్నారామె.
ఈ సినిమాకు ‘చప్పాక్’ అనే టైటిల్ పెట్టారు. ‘రాజీ’ ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ సినిమాతో నిర్మాతగా మారారు దీపిక. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.
దీపికాతో దీపిక
Published Sat, Mar 16 2019 12:46 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment