
దీపికా–రణ్‌వీర్ సింగ్
ఈ ఏడాది ఆల్రెడీ సోనమ్ కపూర్, నేహా ధూపియా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే లిస్ట్‌లోకి దీపికా పదుకోన్ కూడా జాయిన్ అవుతారనుకున్నారు. కానీ ఈ లిస్ట్‌లో దీపికా–రణ్‌వీర్ సింగ్ కొంచెం ఆలస్యంగా జాయిన్ అవుతారని వినిపిస్తోంది. ముందుగా రణ్‌వీర్–దీపికా ఈ నవంబర్ నెలలో పెళ్లి చేసుకుంటారనే వార్త వినిపించింది. దాని కోసం ఏ వర్క్ కమిట్‌మెంట్స్ పెట్టుకోకుండా ఉన్నారని కూడా విన్నాం. తాజాగా పెళ్లి ముహూర్తం ఓ రెండు నెలలు వెనక్కి వెళ్లిందని బాలీవుడ్ టాక్.
వీళ్లిద్దరూ ఇటలీలోని ఓ సముద్ర తీరాన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట. పెళ్లి పనులు మొదలయ్యాయని వార్త వినిపించింది. ఇప్పుడు పెళ్లి వచ్చే ఏడాదికి వాయిదా పడిందని వినిపిస్తోంది. ఆ సంగతలా ఉంచితే.. రణ్‌వీర్ తాను ఉంటున్న ఇంటికి కొత్త హంగులు దిద్దించారట. పెళ్లి తర్వాత ఈ జంట ఆ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నారని టాక్. పెళ్లి ఎప్పుడు? రణ్‌వీర్ ఇంట్లో దీపిక కుడి కాలు పెట్టేదెప్పుడు? అనేది తెలియాలంటే దీపిక–రణ్‌వీర్ నోరు విప్పాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment