
‘ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో నవంబరు 14, 15వ తేదీల్లో మా వివాహ వేడుక జరగనుంది. ఇన్నేళ్లుగా మాపై ప్రేమ కురిపించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రేమతో దీపికా- రణ్‌వీర్’ అంటూ బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ తన పెళ్లి తేదీని ప్రకటించేశారు. తమ వివాహాన్ని ధ్రువీకరిస్తూ పెళ్లి కార్డును కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
కాగా బాలీవుడ్ హాట్ కపుల్ దీపికా పదుకోన్- రణ్‌వీర్ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని చాలా కాలంగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న వీళ్ల వివాహం వాయిదా పడిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ విషయాన్ని రణ్‌వీర్‌సింగ్ దగ్గర ప్రస్తావించగా...‘నా పెళ్లి గురించే నాకే తెలియనన్ని కథనాలు వస్తున్నాయి. నేను వేసుకోబోయే షేర్వాణీ ఆ కలర్ అని, ఎవరెవరో పెళ్లి బహుమతులు ఇవ్వబోతున్నారని కూడా వస్తున్నాయి. నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతాను’ అంటూ వివరణ ఇచ్చారు. దీంతో ఆ ప్రచారం నిజమేనేమోనని దీప్‌వీర్ అభిమానులు నిరాశ పడ్డారు. అయితే వెడ్డింగ్ కార్డును పోస్ట్ చేసి దీపిక అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు.
— Deepika Padukone (@deepikapadukone) October 21, 2018
Comments
Please login to add a commentAdd a comment