ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకోణె తన పెద్దమనసు చాటుకున్నారు. మంగళవారం దావణగెరె జిల్లాలో పర్యటించిన ఆమె దావణగెరె జిల్లా జగళూరు తాలూకా పల్లాగట్టె, బిళిచోడు గ్రామాల్లో మానసికంగా అనారోగ్యానికి గురైన చిన్నారులను పరామర్శించారు. మానసిక అనారోగ్యంపై ప్రజలలో చైతన్యం నింపేందుకు తాను స్థాపించిన లివ్ లవ్ లాఫ్ అనే ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహాయం అందించారు.
ఆయా గ్రామాలు, తాలూకాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరి«శీలించారు. రోగులు పడుతున్న ఇబ్బందులు గమనించి తన వంతు సాయం చేశారు. ఏడీపీ సంస్థ తరఫున దీపికా పదుకోణె మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం నింపి, ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు ఆమె స్వచ్ఛందంగా ముందుకు కదిలారు. మానసిక రోగులపై చొరవ తీసుకుని వారిని మామూలు స్థితికి తీసుకుని వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.
దీపికా పదుకొణె ఆయా గ్రామాల్లో పర్యటించడంతో ఆమెను చూడటానికి జనం ఎగబడ్డారు. గ్రామాల్లో పర్యటించిన అనంతరం దావణగెరెలోని ఓ హోటల్‌కి చేరుకోవడంతో అక్కడ కూడా భారీ ఎత్తున జనం చేరి ఆమెను చూసేందుకు పోటీ పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment