లుక్ అదుర్స్ | Deepika Padukone's first look from Finding Fanny | Sakshi
Sakshi News home page

లుక్ అదుర్స్

Published Thu, Jul 3 2014 11:56 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Deepika Padukone's first look from Finding Fanny

బాలీవుడ్‌లో దీపికా పదుకొనే టైమ్ నడుస్తోంది. ప్రస్తుతం ఆమె పట్టిందల్లా బంగారమే. ఓ వైపు అగ్ర హీరోల సినిమాలు చేస్తూ, మరో వైపు కుర్రహీరోలతో కూడా తెరను పంచుకుంటూ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు దీపిక. టైమ్ బాగుంటే... ఏం చేసినా గొప్పగానే ఉంటుంది. ఎలా కనిపించినా అందంగానే ఉంటుంది అంటారు. దానికి ప్రస్తుతం దీపిక కెరీరే ఓ ఉదాహరణ. ఇటీవలే దీపిక నటించిన ‘ఫైండింగ్ ఫాన్నీ’ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు ఆ చిత్ర నిర్మాతలు సైఫ్ అలీఖాన్, దినేశ్ విజన్.
 
  ఏ ముహూర్తాన ఆ స్టిల్ విడుదల చేశారో కానీ... ఎటు చూసినా పొగడ్తలే. చివరకు బాలీవుడ్ సూపర్‌స్టార్స్ ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు సైతం ‘దీపిక లుక్ అదుర్స్’ అని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. కొందరేమో... ఆ స్టిల్‌లో ఓ విధమైన ప్రత్యేకత ఉందంటూ విశ్లేషిస్తున్నారు. ఫ్రీ హెయిర్ స్టయిల్‌తో... కొంచెం మాసిన మోడ్రన్ వేర్ ధరించి, ఓ చేతిలో రక్తంతో తడిసిన కత్తి పట్టుకొని తల వంచుకొని దీపిక చాలా నమ్రతగా నడుచుకుంటూ వస్తున్నారు. దీపిక ఆహార్యానికీ, ఆమె ముఖంలోని ఎక్స్‌ప్రెషన్‌కీ సంబంధం లేదు. ఇది ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. దర్శకుడు హోమీ అద జానియా భిన్నమైన కథాంశంతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement