బ్రేకప్ నేర్పిన పాఠం!
బ్రేకప్ నేర్పిన పాఠం!
Published Thu, Feb 13 2014 2:28 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
మనసున మనసై.. అంటూ ప్రేమ పాట పాడుకున్నప్పుడు ప్రేమికులకు బాగానే ఉంటుంది. విడిపోయిన తర్వాత ఆ పాటలను, చెప్పుకున్న ఊసులను మర్చిపోవడం అంత సాధ్యం కాదు. రణబీర్‌కపూర్ నుంచి విడిపోయినప్పుడు దీపికా పదుకొనే కూడా అతని తాలూకు జ్ఞాపకాలని మర్చిపోవడానికి చాలా తంటాలు పడ్డారట. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయం గురించి దీపికా మాట్లాడుతూ - ‘‘రణబీర్ నుంచి విడిపోయిన తర్వాత, ఎవరితోనైనా అనుబంధం పెంచుకోవాలంటే చాలా భయమేస్తోంది. ఎందుకంటే, నేను అక్కాచెల్లెళ్ల అనుబంధం, అమ్మానాన్నలతో అనుబంధం, ప్రియుడితో అనుబంధం..
ఇలా ఏ బంధాన్నయినా సీరియస్‌గా తీసుకుంటా. నచ్చిన అబ్బాయితో జస్ట్ అలా డేటింగ్ చేసేసి, ఇలా వదిలేసే టైప్ కాదు. రణబీర్‌తో ప్రేమలో ఉన్నప్పుడు నాకంటూ ఓ సెపరేట్ జీవితం ఉంటుందనే విషయాన్ని మర్చిపోయా. తన స్నేహితులను నా స్నేహితులుగా భావించాను. అన్నిటికీ రణబీర్ మీదే ఆధారపడ్డాను. విడిపోయిన తర్వాతే ‘మన లైఫ్‌ని మనమే డీల్ చేసుకోవాలి. జీవితానికి ఏం ముఖ్యమో అన్నీ నేర్చుకోవాలి’ అని గ్రహించాను. ఒక విధంగా ఈ బ్రేకప్ నాకు మంచి పాఠమైంది’’ అన్నారు.
Advertisement