అక్షయ్ తో రెండోసారి | Director Krish next movie with Akshay Kumar | Sakshi
Sakshi News home page

అక్షయ్ తో రెండోసారి

Published Thu, Mar 3 2016 9:49 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

అక్షయ్ తో రెండోసారి

అక్షయ్ తో రెండోసారి

టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్(రాధా కృష్ణ జాగర్లమూడి) బాలీవుడ్లోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా గబ్బర్ సినిమాను తెరకెక్కించిన క్రిష్, మంచి విజయం సాధించాడు. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నక్రిష్ ఇప్పుడు మరోసారి అక్షయ్ కుమార్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.

బాలీవుడ్లో తొలి ప్రయత్నంగా సీరియస్ సినిమాను తెరకెక్కించిన క్రిష్, ఈ సారి మాత్రం ఓ కామెడీ ఎంటర్టైనర్ను రెడీ చేస్తున్నాడు. కంచె సినిమాతో మంచి విజయం సాధించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ తరువాత వరుణ్ తేజ్ హీరోగా మరో సినిమా చేయాలని భావించాడు. అయితే ఆ సినిమా అనుకున్న సమయానికి సెట్స్ మీదకు వచ్చే అవకాశం కనిపించకపోవటంతో మరోసారి బాలీవుడ్ బాట పట్టాడు.

ట్రినిటీ పిక్చర్, ఇరోస్ ఇంటర్ నేషనల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను హిందీతో పాటు తమిళంలోనూ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో హీరో ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement