gabbar
-
గబ్బర్ అనే పేరు ఎలా వచ్చిందో చెప్పిన ధావన్
-
‘గబ్బర్’ కథ చెప్పిన ధావన్
న్యూఢిల్లీ : టీమిండియా డాషింగ్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్‌ను అందరు ముద్దుగా గబ్బర్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. మైదానంలోనైనా.. ఆఫ్‌ది ఫీల్డ్ అయినా ఈ ఢిల్లీ ఆటగాడు గబ్బర్గానే అందరికి సుపరిచితం. అయితే ఈ గబ్బర్ అనే పేరు ఎలా వచ్చిందో.. దాని వెనుక ఉన్న కథ ఎంటో ఇటీవల ధావన్ తెలియజేశాడు. ప్రముఖ యాంకర్ గౌరవ్ కపూర్ నిర్వహించే బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ అనే వెబ్ సిరీస్‌లో గబ్బర్ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. గబ్బర్ నిక్‌నేమ్ అలా.. గబ్బర్ అనే పేరు తన ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్ విజయ్ దాహియా పెట్టినట్లు ధావన్ పేర్కొన్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న రోజుల్లో తాను ఎక్కువగా హిందీ బాలీవుడ్ విలన్ డైలాగ్‌లు చెప్పేవాడినని, దీంతో తనను గబ్బర్‌గా పిలవడం ప్రారంభించారని తెలిపాడు. ఇక ఒక దశలో క్రికెట్ నుంచి దూరం కావాలనుకున్నానని కూడా చెప్పాడు. తన కెరీర్ ముగిసిందని, తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుందామని నిర్ణయించుకున్న తరుణంతో తన కోచ్ మరో అవకాశం ఇచ్చాడని ధావన్ గుర్తు చేసుకున్నాడు. ఇక తన భార్య తన బలమని చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియాతో అరంగేట్ర టెస్టులో గబ్బర్ సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. 2013 చాంపియన్స్ ట్రోఫీ భారత్ నెగ్గడంలో ధావన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీ అత్యధిక పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలవడమే కాకుండా గోల్డెన్ బ్యాట్‌ను సైతం అందుకున్నాడు. -
అక్షయ్ తో రెండోసారి
టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రిష్(రాధా కృష్ణ జాగర్లమూడి) బాలీవుడ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా గబ్బర్ సినిమాను తెరకెక్కించిన క్రిష్, మంచి విజయం సాధించాడు. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నక్రిష్ ఇప్పుడు మరోసారి అక్షయ్ కుమార్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్లో తొలి ప్రయత్నంగా సీరియస్ సినిమాను తెరకెక్కించిన క్రిష్, ఈ సారి మాత్రం ఓ కామెడీ ఎంటర్టైనర్ను రెడీ చేస్తున్నాడు. కంచె సినిమాతో మంచి విజయం సాధించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ తరువాత వరుణ్ తేజ్ హీరోగా మరో సినిమా చేయాలని భావించాడు. అయితే ఆ సినిమా అనుకున్న సమయానికి సెట్స్ మీదకు వచ్చే అవకాశం కనిపించకపోవటంతో మరోసారి బాలీవుడ్ బాట పట్టాడు. ట్రినిటీ పిక్చర్, ఇరోస్ ఇంటర్ నేషనల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను హిందీతో పాటు తమిళంలోనూ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో హీరో ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
బాలీవుడ్లో 'కంచె'..?
వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ (రాధకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో తెరకెక్కి, ఘనవిజయం సాధించిన సినిమా 'కంచె'. పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు సౌత్‌తో పాటు నార్త్ ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో సాగే కథ కావటంతో జాతీయ స్థాయిలో కూడా ఈ కథ వర్క్అవుట్ అవుతుందని భావిస్తున్నారు.. బాలీవుడ్ నిర్మాతలు. క్రిష్ కూడా కంచె సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం మంచి ఆఫర్స్ వచ్చినా, రీమేక్ చేయాలనే ఆలోచనతో వాటన్నింటినీ తిరస్కరించాడు. స్టార్ హీరోతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు క్రిష్. బాలీవుడ్లో క్రిష్ తెరకెక్కించిన 'గబ్బర్' సినిమా మంచి వసూళ్లను సాధించింది. దీంతో కంచె సినిమాను కూడా తానే డైరెక్ట్ చేసే ఆలోచనలోఉన్నాడు క్రిష్. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా బాలీవుడ్ వర్షన్లో హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తారు, నిర్మాణ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్న విషయంపై మాత్రం ఇంకా చెప్పలేదు. గతంలో కూడా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గమ్యం' సినిమాను ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు రీమేక్ చేస్తారన్న వార్తలు బలంగా వినిపించాయి. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రాలేదు, మరి కంచె అయినా తెరకెక్కుతుందో.. లేదో.. చూడాలి. -
ఇది రీమేక్స్ ఇయర్!
బాలీవుడ్ గెలిచే గుర్రంపై పందెం కడితే గెలుపు మనదే. ఇది చిత్రసీమకూ వర్తిస్తుంది. కొత్త కథతో సినిమా తీయడంలో ఉన్న రిస్క్, ఆల్రెడీ బంపర్ హిట్ అయిన చిత్రాలు తీయడంలో ఉండదు. అందుకే ఇతర భాషల్లో విజయం సాధించిన చిత్రాలపై దర్శక, నిర్మాతలు దృష్టి పెడుతుంటారు. అలాగే తమ భాషలో రూపొందిన పాత చిత్రాలను కూడా రీమేక్ చేస్తుంటారు. రీమేక్ అనేది ఒక విధంగా ‘సేఫ్ గేమ్’ అనొచ్చు. అలా హిందీ రంగంలో... ప్రస్తుతం ఏడెనిమిది సేఫ్ గేమ్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం... గబ్బర్ గెలుస్తాడా? విజయ్‌కాంత్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘రమణ’ తెలుగులో చిరంజీవితో ‘ఠాగూర్’గా పునర్నిర్మితమైంది. రెండు భాషల్లోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ‘రమణ’ ఆధారంగా హిందీలో రూపొందిన చిత్రం ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’. అక్షయ్‌కుమార్, శ్రుతీహాసన్ జంటగా తెలుగు దర్శకుడు ‘క్రిష్’ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మే 1న విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. మరి.. దక్షిణాదిన రెండు భాషల్లో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఉత్తరాదిన ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి? నార్త్‌లోనూ... అంత దృశ్యం ఉంటుందా? కొన్ని కథలు ఏ భాషలవారికైనా నచ్చుతాయి. మలయాళ ‘దృశ్యం’ కథ అలాంటిదే. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్ అయ్యి, ఘనవిజయం సొంతం చేసుకుంది. హిందీలో ‘దృశ్యం’ పేరుతో రీమేక్ అవుతోంది. అజయ్ దేవగణ్, శ్రీయ జంటగా నిశికాంత్ కామత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో పోలీసాఫీసర్ పాత్రను టబు చేస్తున్నారు. ఇప్పటికి మూడు భాషల్లో విజయం సాధించిన ఈ ‘దృశ్యం’ ఉత్తరాదివారిని హత్తుకుంటుందో, లేదో నాలుగైదు నెలల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే, ఈ చిత్రాన్ని అప్పుడు విడుదల చేయాలనుకుంటున్నారు. నాటి హీరోను తలపిస్తుందా? దాదాపు 30 ఏళ్ల క్రితం జాకీ ష్రాఫ్, మీనాక్షీ శేషాద్రి జంటగా స్వీయదర్శకత్వంలో సుభాష్ ఘయ్ రూపొందించిన చిత్రం ‘హీరో’. ఈ సినిమాతో జాకీ, మీనాక్షీ స్టార్స్ అయిపోయారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు హీరో సల్మాన్ ఖాన్ పునర్నిర్మిస్తున్నారు. నటుడు ఆదిత్యా పంచోలీ తనయుడు సూరజ్ పంచోలీ, నటుడు సునీల్‌శెట్టి కుమార్తె అథియా శెట్టి ఈ చిత్రం ద్వారా నాయకా నాయికలుగా పరిచయమవుతున్నారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరి.. నాటి ‘హీరో’లా నేటి ‘హీరో’ ఘనవిజయం సాధిస్తుందా? సౌత్‌లో హీరో కథ...నార్త్‌లో హీరోయిన్ కథ... తమిళంలో ఘనవిజయం సాధించిన ‘మౌన గురు’ హిందీలో పునర్నిర్మితమవుతోంది. తమిళంలో కథానాయకుడు ప్రాధాన్యంగా సాగే ఈ చిత్రకథను హిందీలో కథానాయిక ప్రాధాన్యంగా సాగేట్లు మలిచి, దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. సోనాక్షీ సిన్హా కథానాయికగా ఈ చిత్రం రూపొందుతోంది. దీనికి ‘అకిరా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రం కోసం సోనాక్షీ సిన్హా పోరాటాలు నేర్చుకున్నారు. ఇందులో ప్రముఖ నటుడు, సోనాక్షీ సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ఆరంభమైంది. అక్కడి ‘వారియర్’...ఇక్కడ బ్రదర్స్ 2011లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘వారియర్’ చిత్రం రీమేక్ హక్కులను కరణ్ జోహార్ పొందారు. ఈ చిత్రాన్ని ‘బ్రదర్స్’ పేరుతో కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో ఆయన పునర్నిర్మిస్తున్నారు. అక్షయ్‌కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా, జాకీ ష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ అతిథి పాత్ర చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం సిద్ధార్థ్ మల్హోత్రా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అక్షయ్ కుమార్‌కు ఆల్రెడీ ఈ కళ తెలుసు. హాలీవుడ్లో ‘వారియర్’కు భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. మరి.. హిందీలో ‘బ్రదర్స్’గా రీమేక్ అవుతున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో? ఇవి కాకుండా తెలుగులో ఘనవిజయం సాధించిన ‘మగధీర’ చిత్రం హిందీలో రీమేక్ కానుంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో తాను పోషించనున్న రెండు పాత్రల కోసం భారీ ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. అలాగే, తమిళంలో ఘనవిజయం సాధించిన ‘సూదు కవ్వుమ్’ చిత్రం కూడా హిందీలో పునర్నిర్మితం కానుంది. ఇంకా ఈ జాబితాలో చాలా చిత్రాలున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ రీమేక్ చిత్రాలు రూపొందుతున్నాయి కాబట్టి, హిందీ రంగ పరంగా ఈ ఏడాది ‘రీమేక్స్ ఇయర్’ అని చెప్పొచ్చు. - డి.జి. భవాని -
మరోసారి ఐటం నెంబర్లో కరీనా
-
పోటీ చేసే ఉద్దేశం లేదు
‘‘రాష్ట్ర విభజన వల్ల కొందరు ఆనందంతో ఉంటే... ఇంకొందరు బాధలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి దిగడం సమంజసం కాదు’’ అని సుమన్ అన్నారు. తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ... మంగళవారం ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు సుమన్. ‘‘నేను ఏ పార్టీలోనూ లేను. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశమే ఉంటే.. స్వయంగా వెల్లడిస్తాను. వివిధ పార్టీల్లో ఉన్న నా మిత్రులు కూడా ప్రచారం చేయమని అడుగుతున్నారు. ఇప్పటివరకూ ఏ అభిప్రాయానికీ నేను రాలేదు’’ అని తెలిపారు. ఈ నెలాఖరు వరకూ బాలీవుడ్ ‘గబ్బర్’ షూటింగ్లో తాను బిజీగా ఉంటానని సుమన్ వెల్లడించారు. -
శృతే బెటర్
అదృష్టాన్ని ఎవరూ అడ్డుకోలేరంటారు. ఏది ఎవరికి దక్కాలనుకుంటే వారికే దక్కుతుంది. ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే నటి శృతి హాసన్ విషయంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఈ బ్యూటీ తెలుగు, హిందీ భాషల్లో క్రేజీ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. తమిళంలో హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్న శృతికి త్వరలోనే అది నెరవేరే సమయం వచ్చే అవకాశం ఉంది. ఈ ముద్దుగుమ్మకు మరో బాలీవుడ్ అవకాశం వచ్చింది. తమిళంలో విజయకాంత్ నటించిన రమణ చిత్రం హిందీలో రీమేక్ కానుంది. గబ్బర్ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం లో అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. వానం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దీనికి దర్శకుడు. హీరోయిన్గా సిమ్రాన్ పాత్రకు దక్షిణాది ఛాయలున్న హీరోయిన్ కోసం అన్వేషించారు. చివరికి శృతిహాసన్‌ను ఎంపిక చేసి ఫొటో సెషన్ కూడా చేశారు. అయితే శృతిలో దక్షిణాది అమ్మాయి ఛాయలు కనిపించకపోవడంతో ఆ పాత్రకు నటి అమలాపాల్‌ను ఎంపిక చేయాలనుకున్నారు. ఆమెతోను ఫొటో షూట్ చేశారు. దీంతో బాలీవుడ్లో ఒక రౌండ్ కొట్టేయవచ్చని ఈ కేరళ కుట్టి తెగ ఉత్సాహపడిపోయింది. అయితే మళ్లీ గబ్బర్ చిత్ర దర్శక నిర్మాతలు శృతిహాసన్‌నే ఎంపిక చేశారు. ఆ పాత్రకు ఆమె బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. శృతికి బాలీవుడ్లో ఉన్న పాపులారిటీనే వారి నిర్ణయానికి కారణం అని సమాచారం. ప్రస్తుతం శృతి హిందీలో వెల్కంబ్యాక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో రామ్‌చరణ్ సరసన నటించిన ఎవడు సంక్రాంతి కానుకగాను అల్లుఅర్జున్‌కు జంటగా నటించిన రేస్ గుర్రం ఫిబ్రవరిలోను విడుదలకు సిద్ధం అవుతున్నాయి. -
మళ్లీ గబ్బర్ టెర్రర్
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: పోలీసుల వైఫ్యలం కారణంగా జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో రౌడీల దందాలు, దాడులు విచ్చలవిడిగా సాగుతున్నాయి. కొద్దినెలల క్రితం వరకు పట్టణంలో రౌడీరాజ్యం చెలాయించి, పత్రికల్లో వార్తలు రావడం.. పోలీసులు ఏవో కొన్ని చర్యలు తీసుకోవడంతో కొద్దికాలంపాటు మౌనం వహించిన పంచ భూతాల్లో ఒకడైన గబ్బర్ గ్యాంగ్ మళ్లీ దాడులకు తెగబడుతోంది. తనపై రౌడీ షీట్ ఉన్నా ఏమాత్రం భయపడకుండా గబ్బర్ దాడులకు దిగుతుండటం గమనార్హం. దమ్మల వీధికి చెందిన ఈ గ్యాంగ్ తాజాగా ఆదివారం అర్ధరాత్రి ప్రశ్నించిన పాపానికి ఓ ఆటో డ్రైవర్‌పై దాడి చేసి చితక్కొట్టారు. పట్టణంలోని బొడెమ్మ కోవెల సమీపంలో నివాసముంటున్న ఆటో డ్రైవర్ మైలపిల్లి భీమారావు ఆదివారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో తన పని ముగించుకుని ఆటోలో ఇంటికి వెళుతుండగా పందుంపుల్ల సెంటర్ వద్ద గబ్బర్, అతని సోదరుడు శ్రీనివాసరావు, మరికొందరు అనుచరులు ఆపి ఆటోలో తమను ఇళ్ల వద్ద దిగబెట్టాలని డిమాండ్ చేశారు. మీ అందరి వద్ద బళ్లు ఉన్నాయి కదా.. ఆటోలో దిగబెట్టడమేమిటని భీమారావు వారిని ప్రశ్నించాడు. అంతే.. మమ్మల్నే ఎదురు ప్రశ్నిస్తావా అంటూ ఆ గ్యాంగ్ భీమారావుపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.దాంతో అతని శరీరంపై చాలా చోట అవుకు దెబ్బలు తగలగా, కింది పెదవి పూర్తిగా చిట్లిపోయింది. గాయాలతో రిమ్స్‌లో చేరిన బాధితుడి నుంచి అక్కడి ఔట్ పోస్టు పోలీసులు వివరాలు సేకరించారు. తనపై దమ్మల వీధికి చెందిన రాయితి గబ్బర్, రాయితి శ్రీనివాసరావు, దుమ్ము అప్పన్న(కలస అప్పన్న), వాడల రాంబాబు(పొట్టి రాంబాబు)తో పాటు మరికొంత మంది దాడి చేశారని భీమారావు పోలీసులకు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న గబ్బర్ ముఠా ఆస్పత్రికి వచ్చి కేసు విత్‌డ్రా చేసుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. ‘మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. ఏ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫర్వాలేదు.. ఎంతైనా ఖర్చు పెట్టి బయటకు రాగలమంటూనే కేసు విత్‌డ్రా చేసుకోకపోతే నిన్ను చంపేసి కేసు లేకుండా చేసుకోగలమని’ బెదరించారు. దీంతో రిమ్స్‌లో తనకు రక్షణ ఉండదని భయపడిన భీమరావు సోమవారం ఉదయం శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి మళ్లీ ఫిర్యాదు చేశాడు. తనను కొట్టిన వారిలో బర్రి మురళీ, తోటయ్య కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెలుగులోకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం గబ్బర్ ముఠా ఆగడాలు ప్రజలను ఎంతగా భయపెడుతున్నాయో చెప్పడానికి మరో ఉదాహరణ.. వీరి కారణంగానే ఇటీవల ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన. శ్రీకాకుళం ఒకటో పట్టణ పరిధిలో పని చేస్తున్న ఓ హోంగార్డు భార్య పట్ల ఇటీవల గబ్బర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకున్నారు. దీనిపై ఆ హోంగార్డు వెంటనే ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం. అయితే ఏం జరిగిందో గానీ.. ఆ సంఘటనపై కేసే లేకుండా పోయింది. వెలుగులోకి రాని ఇటువంటి దారుణాలు ఎన్నో గబ్బర్ ముఠా ఖాతాలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ముఠా దాడులు, ఆగడాలతో బయట తిరగాలంటేనే భయమేస్తోందని దమ్మల వీధి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి చిన్న విషయంలోనూ ఈ ముఠా జోక్యం చేసుకుని అమాయకులను చితకబాదేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసులు నమోదై, అరెస్టు అయినా.. ఇలా వెళ్లి.. అలా బయటకు వచ్చేసి.. మరింతగా రెచ్చిపోతున్నారని.. అందువల్ల పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న భయమేస్తోందని వాపోతున్నారు. నిందితుల అరెస్టు కాగా ఆటో డ్రైవర్ భీమరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయితి గబ్బర్, రాయితి శ్రీనివాసరావు, దుమ్ము అప్పన్న, వాడల రాంబాబులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్సై భాస్కరరావు తెలిపారు.