శిఖర్ ధావన్ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : టీమిండియా డాషింగ్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్‌ను అందరు ముద్దుగా గబ్బర్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. మైదానంలోనైనా.. ఆఫ్‌ది ఫీల్డ్ అయినా ఈ ఢిల్లీ ఆటగాడు గబ్బర్‌గానే అందరికి సుపరిచితం. అయితే ఈ గబ్బర్ అనే పేరు ఎలా వచ్చిందో.. దాని వెనుక ఉన్న కథ ఎంటో ఇటీవల ధావన్ తెలియజేశాడు. ప్రముఖ యాంకర్ గౌరవ్ కపూర్ నిర్వహించే బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ అనే వెబ్ సిరీస్‌లో గబ్బర్ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
గబ్బర్ నిక్‌నేమ్ అలా..
గబ్బర్ అనే పేరు తన ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్ విజయ్ దాహియా పెట్టినట్లు ధావన్ పేర్కొన్నాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న రోజుల్లో తాను ఎక్కువగా హిందీ బాలీవుడ్ విలన్ డైలాగ్‌లు చెప్పేవాడినని, దీంతో తనను గబ్బర్‌గా పిలవడం ప్రారంభించారని తెలిపాడు. ఇక ఒక దశలో క్రికెట్ నుంచి దూరం కావాలనుకున్నానని కూడా చెప్పాడు. తన కెరీర్ ముగిసిందని, తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుందామని నిర్ణయించుకున్న తరుణంతో తన కోచ్ మరో అవకాశం ఇచ్చాడని ధావన్ గుర్తు చేసుకున్నాడు. ఇక తన భార్య తన బలమని చెప్పుకొచ్చాడు.
ఇక ఆస్ట్రేలియాతో అరంగేట్ర టెస్టులో గబ్బర్ సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. 2013 చాంపియన్స్ ట్రోఫీ భారత్ నెగ్గడంలో ధావన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీ అత్యధిక పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలవడమే కాకుండా గోల్డెన్ బ్యాట్‌ను సైతం అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment