దిశాకి 'సరైనోడు' దొరికాడు
లోఫర్ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశాపటాని. తొలి సినిమాతో భారీ హిట్ సాధించలేకపోయినా తన గ్లామర్తో మంచి మార్కులే సాధించింది. దీంతో వరుస అవకాశాలతో బిజీ అయిపోతుందని భావించారు అంతా.. కానీ అనుకున్నట్టుగా అమ్మడికి అవకాశాలు తలుపు తట్టలేదు. లోఫర్ తరువాత ఇంతవరకు ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వని దిశా.. తాజాగా ఓ స్టార్ హీరోతో ఐటమ్ సాంగ్కు రెడీ అవుతోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్.., బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలోనటిస్తున్నాడు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం దిశా పటానిని సంప్రదించారట. గతంలో ఈ పాటను అంజలి, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్లతో చేయించాలని ప్లాన్ చేసినా, గ్లామర్ పాళ్లు మరింతగా ఉండాలనే ఉద్దేశంతో దిశాకే ఓటేశారు చిత్రయూనిట్. స్పెషల్ సాంగ్లో నటించడానికి దిశా కూడా ఓకె చెప్పేయటంతో త్వరలోనే ఈ పాట షూట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు సరైనోడు యూనిట్.