పని లేదని బాధపడొద్దు | Donot be disappointed if not getting work, says shah rukh khan | Sakshi
Sakshi News home page

పని లేదని బాధపడొద్దు

Published Tue, Apr 12 2016 1:02 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

పని లేదని బాధపడొద్దు

పని లేదని బాధపడొద్దు

తగినంత పని చేతిలో లేకపోయినా పెద్దగా బాధపడొద్దని నటీనటులను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కోరాడు. టీవీ నటి ప్రత్యూషా బెనర్జీ మృతిపట్ల ఆయన తన సంతాపం తెలిపారు. 'ఫ్యాన్' సినిమా ప్రమోషన్ సందర్భంగా షారుక్‌ను ఈ అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి షారుక్ సమాధానమిచ్చారు. ''మీరు అడుగుపెట్టిన రంగంలో తగినంత విజయం రాకపోయినా నిరాశపడొద్దు. ప్రతివాళ్లకు మంచిరోజులు, చెడ్డరోజులు వస్తుంటాయి. చెడ్డ రోజుల గురించి ఆలోచిస్తూ బాధపడటం అనవసరం. మీకు పని చేతనైతే ఈరోజు కాకపోతే రేపు మీకు వచ్చి తీరుతుంది.

మీ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మీలో సత్తా ఉండబట్టే ఇక్కడివరకు వచ్చారు. ఇప్పటికే ఈ రంగంలో స్థిరపడ్డారు కాబట్టి పని ఎందుకు దొరకదు? ఒకటి రెండు రోజులు దొరక్కపోయినా మీరు ఆందోళన చెందొద్దు'' అని సలహా ఇచ్చారు. అనవసరంగా బాధపడినంత మాత్రాన ప్రయోజనం ఉండదని అన్నారు. టాలెంట్ ఉంటే పని అదే దొరుకుతుందని, దాని మీద విశ్వాసం ఉంచాలని చెప్పారు. బాలికా వధు సీరియల్‌తో తారాపథానికి వెళ్లిన ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్యతో టీవీ పరిశ్రమ యావత్తు దిగ్భ్రాంతిలో మునిగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement