ఒంటరిగా ఈ సినిమా చూడగలరా..! | Dont Try To Watch Alone Anushka Sharma Pari | Sakshi
Sakshi News home page

ఒంటరిగా ఈ సినిమా చూడగలరా..!

Published Thu, Mar 1 2018 3:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Dont Try To Watch Alone Anushka Sharma Pari  - Sakshi

అనుష్క శర్మ నటించిన పరి చిత్రంలోని ఓ భయంకర సన్నివేశం

సాక్షి, ముంబయి : అనుష్క శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హర్రర్ చిత్రం ‘పరి’.. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టిస్తుండగా చిత్ర యూనిట్‌, అనుష్క శర్మలు కలిసి వరుసగా స్రీమర్ల పేరుతో చిత్రంలోని భయానక సన్నివేశాలు విడుదల చేస్తున్నారు. ఇందులో అనుష్క శర్మను చూస్తే కచ్చితంగా భయపడతారు. ఇప్పటి వరకు ఆరు స్క్రీమర్లను విడుదల చేసిన చిత్ర యూనిట్‌ సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు మరో స్క్రీమర్‌(7వది)ను విడుదల చేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన చిన్నచిన్న సీన్‌లలో ఒక్కోసారి అమాయకంగా కనిపిస్తూనే.. అనూహ్యంగా భయానక రూపంతో ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసింది.

అయితే, తాజాగా విడుదల చేసిన స్క్రీమర్‌లో మాత్రం నిండుగర్బిణీగా ఉన్న అనుష్కశర్మను చూపించారు. అయితే, చిమ్మచీకటిలో రక్తపు వర్ణం కలిగిన నీరు ఉన్న బాత్‌ డబ్‌లో ఆమెను గొలుసులతో కట్టేసి ఉండగా అనూహ్యంగా తెరపై దెయ్యపు నీడ దర్శనం ఇస్తుంది. ఆ తర్వాత ఆమె గర్బాన్ని దెయ్యం పిల్ల చీల్చుకొని బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చూపించారు. అత్యంత భయానకంగా ఈ సీన్‌ ముగిసే సమయానికి దెయ్యం రేపే విడుదలవుతోంది అంటూ ముగించారు. బెంగాలీ దర్శకుడు ప్రొసిత్ రాయ్ దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 2న విడుదల కానుంది. ఈ సినిమాను ఒక్కరే చూస్తే మాత్రం మరుసటి రోజు పగటి పూట కూడా ఆమె భయానక రూపాలు వెంటపడతాయేమో అన్నట్లుగా ప్రచార చిత్రాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement