సమాజంలో ఎలా జీవించాలో చెప్పాం | Dorairaju says about his movie, 'Premantene Chitram' | Sakshi
Sakshi News home page

సమాజంలో ఎలా జీవించాలో చెప్పాం

Published Tue, Nov 5 2013 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM

సమాజంలో ఎలా జీవించాలో చెప్పాం

సమాజంలో ఎలా జీవించాలో చెప్పాం

‘‘తల్లిదండ్రులకు తెలియకుండా డేటింగ్‌లు చేయడం, కెమెరాలకు, సెల్‌ఫోన్లకు బలైపోవడం నేటి యువతకు పరిపాటైపోయింది. దే శంలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనలు

‘‘తల్లిదండ్రులకు తెలియకుండా డేటింగ్‌లు చేయడం, కెమెరాలకు, సెల్‌ఫోన్లకు బలైపోవడం నేటి యువతకు పరిపాటైపోయింది. దే శంలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనలు ఈ సినిమా కళ్లకు కడుతుంది. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా సమాజంలో ఎలా జీవించాలో ఈ సినిమా ద్వారా చెప్పాం. యువతకు కనువిప్పులాంటిదీ సినిమా’’ అన్నారు దర్శకుడు వి.ఆర్. దొరైరాజు. మానస్, ఆరుషి జంటగా గంగవరపు శ్రీనివాసులునాయుడు, జీవీ నరసయ్య, కృత్య సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమంటేనే చిత్రం’.

 ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని దొరైరాజు ఆనందం వ్యక్తం చేస్తూ సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘ఈ సినిమా విజయం నాకు రెండు అవకాశాలు తెచ్చిపెట్టింది. ఓ ప్రముఖ హీరోతో ఓ సినిమా చేయబోతున్నాను. గురుపాటి సురేష్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. అలాగే పంపిణీదారుడు నందా నిర్మాతగా ఓ చిత్రం ఉంటుంది. ఇందులో ఇద్దరు యువ హీరోలు నటిస్తారు. వినోదం, సందేశం కలగలిసిన కథాంశాలతో ఈ చిత్రాలు చేయబోతున్నాను’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement